చైనా కృత్రిమ సూర్యుడి ప్రయోగం ప్రపంచ శ్రేయస్సుకా.. వినాశనానికా?

Artificial sun | ఎట్టకేలకు చైనా అనుకున్నది సాధించింది. కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ సూర్యుడిని రూపొందించిన చైనా.. ఇప్పుడు ఈ కీలక ప్రయోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. 70 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను దాదాపు 1056 సెకండ్ల పాటు ఉత్పత్తి చేసింది. అదే నిజమైన సూర్యుడి కోర్ వద్ద కేవలం 15 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే ఇది అసలైన సూర్యుడి కంటే దాదాపు ఐదు రెట్లు వేడిగా ఉంటుంది. మొత్తానికి అనుకున్నది సాధించి ఔరా అనిపించింది. మరి ఈ అసలైన సూర్యుడిలా ఈ కృత్రిమ సూర్యుడు కూడా నిప్పులు చెరుగుతూ వెలుగును అందిస్తాడా? అసలు చైనా ఈ ప్రయోగం ఎందుకు చేపట్టింది? ఈ ప్రయోగంతో భారత్‌కు ఏదైనా ముప్పు ఉంటుందా? వంటి విషయాలు ఒకసారి చూద్దాం..
అసలైన సూర్యుడికి కృత్రిమ సూర్యుడికి తేడా ఏంటి?
మనకు తెలిసిన సూర్యుడు ఆకాశంలో ఉంటాడు. ఎల్లప్పుడు నిప్పులు చెరుగుతూ విశ్వం మొత్తానికి వెలుతురు, శక్తిని అందిస్తాడు. మరి చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు కూడా ఆకాశంలో ఉండి నిప్పులు చెరుగుతూ వెలుగునిస్తాడా? అనే సందేహం మొదట్లో చాలా మందిలో ఉండేది. కానీ అదేదీ నిజం కాదు. ఇంకా చెప్పాలంటే ఇదొక రియాక్టర్. విద్యుత్ తదితర అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. అయితే ఈ రియాక్టర్ ఉత్పత్తి చేసే అధిక వేడి, శక్తి కారణంగా దీన్ని కృత్రిమ సూర్యుడు అని పిలుస్తున్నారు.

అచ్చం సూర్యుడిలాగే..
సూర్యుడి పరమాణు కేంద్రంలో అత్యధిక శక్తి ఉంటుంది. అందులోని అణువులు విచ్ఛిన్నమైనప్పుడు భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది.ఇది దాదాపు 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతగా ఉంటుంది. అచ్చం సూర్యుడిలాగే అణు సంలీన ప్రక్రియ(ఫ్యూజన్)లో భాగంగా హైడ్రోజన్, డ్యూటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగించి అణు కలయికను ప్రేరేపిస్తారు. దీని ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తారు. తాజాగా చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో భాగంగా 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సృష్టించారు.
ఈ ప్రయోగం దేనికోసం..
ఫ్యూజన్ రియాక్టర్ ద్వారా ఉత్పత్తి చేసిన శక్తిని చైనా విద్యుదుత్పత్తితో పాటు ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని చెబుతోంది. కానీ ఈ ప్రయోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక దురుద్దేశం కూడా ఉండొచ్చనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ శక్తిని అణ్వాయుధాలకు సైతం ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అలా గనుక చైనా చేస్తే.. భారత్, అమెరికా వంటి దేశాలకు ముప్పు తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఉన్నట్టుండి సూర్యుడు మాయమైపోతే ఎలా? భూమిపై మనుషులు ఏమవుతారు?
చైనా కృత్రిమ సూర్యుడి రికార్డు!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

