Strongest Glass : ఈ గాజు మహా బలమైనది.. ఫోన్ స్క్రీన్లుగా వస్తే పగిలే సమస్య ఉండదంట!
Strongest Glass : కెనడియన్ శాస్త్రవేత్తలు పగిలేందుకు వీలు లేని గాజును రూపొందించారు. ఇలాంటి గాజుతో మొబైల్ స్క్రీన్...

(Strongest Glass) చేతిలో నుంచి మొబైల్ ఫోన్ జారి పడి ముక్కలవడం మనం చూస్తుంటాం. వేలు పోసి కొన్న మొబైల్ ఫోన్ అద్దం అలా పగలకుండా ఉంటే ఎంత బాగుండు! అని అనుకోని వారు ఉండరు. అచ్చం ఇలాంటి వారి కోరికను తీర్చడం కోసమే అన్నట్లు గా కెనడియన్ శాస్త్రవేత్తలు పగిలేందుకు వీలు లేని గాజును రూపొందించారు. ఇలాంటి గాజుతో మొబైల్ స్క్రీన్ తయారుచేస్తే ఇక ఎన్నిసార్లు కిందపడినా ఏ బాధా ఉండదు. ఈ గాజుకు సంబంధించిన విషయాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఈ గాజును ప్రత్యేక రకం యాక్రిలిక్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇది కఠినంగా మారేలా చేసేటప్పుడు మరింత బలాన్ని పొందుతుంది. ఈ గ్లాస్‌ను కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు. యాక్రిలిక్ మెటీరియల్‌తో తయారు చేసిన గ్లాస్ కొంతవరకు ప్లాస్టిక్‌ని పోలి ఉంటుంది. దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగలిగితే మొబైల్ స్క్రీన్లు పగిలిపోయే ప్రమాదాన్ని నివారించవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ గాజుతో తయారైన ఫోన్ స్క్రీన్ ఎత్తు నుంచి పడిపోయినా దెబ్బతినే ప్రమాదం ఉండదని వారు అభయమిస్తున్నారు.
ఈ యాక్రిలిక్ గాజు తయారు చేయడానికి నల్ల గుల్ల ప్రేరణగా నిలిచిందని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారు. నత్త గుల్ల షెల్ చాలా బలంగా ఉండి, లోపలి భాగం చిన్న మైక్రోస్కోపిక్ స్ట్రిప్స్‌తో తయారై ఉంటుంది. నత్త గుల్లను పగలగొట్టడం చాలా కష్టమైన పని. అందుకే దీని ప్రేరణగా పరిశోధనలు జరిపి యాక్రిలిక్ గాజును సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది.
దీనికి సంబంధించి పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయని, మరింత దృఢమైన గాజును తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మెక్‌గిల్ వర్శిటీ పరిశోధకులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దులో తాలిబాన్ ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్
ప్రపంచ ఫార్మసీగా భారత్ అవతరణ : సౌమ్య స్వామినాథన్
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
భారత్‌లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఈశాన్యంలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు
తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్‌లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

