Best Smartphones under Rs.10000: రూ.10 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే

ఇది టెక్నాలజీ యుగం. ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్లే. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. దానికి కారణం స్మార్ట్ ఫోన్. అయితే.. స్మార్ట్ ఫోన్ కొనాలంటే వేలకు వేలు పెట్టాలి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్‌ను కొనలేమా? తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ కలిగిన కొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అవేంటో, వాటి ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
Realme Narzo 30A

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవాళ్లకు బెస్ట్ ఆప్షన్ రియల్మీ నార్జో 30ఏ. దీని ధర 8,999 రూపాయలు మాత్రమే. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పాటు 3జీబీ, 4 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. అలాగే.. 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ మెమోరీ ఆప్షన్లతో పాటు.. 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకత.
Realme C25S

రియల్మీ సీ25ఎస్ స్మార్ట్ ఫోన్ బేసిక్ మోడల్ ధర రూ.9,999 మాత్రమే. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో వచ్చే ఈ ఫోన్ 13 ఎంపీ ప్లస్ 2 ఎంపీ ప్లస్ 2 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరాను కలిగి ఉంటుంది. 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ఫీచర్లు.
VIVO U10

వివో యూ10 స్మార్ట్ ఫోన్ బేసిక్ మోడల్ ధర 9,990 రూపాయలు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ఎస్ఓసీ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ వేరియంట్స్, 32 జీబీ, 64 జీబీ ఇంటర్నల్ మెమోరీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 6.35 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ 13 ఎంపీ ప్లస్ 8 ఎంపీ ప్లస్ 2 ఎంపీతో పాటు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ లభిస్తుంది.
Xiaomi Redmi Note 8

జియోమీ రెడ్మీ నోట్ 8 బేసిక్ మోడల్ ధర 9,999 రూపాయలు. ఇది 4 జీబీ ర్యామ్, 64 జీబీ హార్డ్ డిస్క్ ఇంటర్నల్ స్టోరేజీతో పాటు 6.3 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 ఎంపీ ప్లస్ 2 ఎంపీ ప్లస్ 2 ఎంపీ రేర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ఫీచర్లు.
Realme 5s

తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ అంటే రియల్మీ 5 ఎస్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ 5 తర్వాత వచ్చిన మోడల్ ఇది. దీని ప్రారంభ ధర 9,999 రూపాయలు. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. ఒకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమోరీ వేరియంట్, 4 జీబీ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ మెమోరీ వేరియంట్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. బ్లూ, క్రిస్టల్ రెడ్, పర్పుల్ కలర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 48 ఎంపీ ప్లస్ 8 ఎంపీ ప్లస్ 2 ఎంపీ ప్లస్ 2 ఎంపీ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

