Best Gaming Smartphones: గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? 15 వేల లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే

Best Gaming Smartphones: నేటి యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లకు అతుక్కపోతోంది. ముఖ్యంగా పబ్ జీ లాంటి గేమ్స్ వచ్చి యువతను ఫోన్లకే అంకితం చేసేశాయి. అయితే.. చాలామంది గేమింగ్ కు సపోర్ట్ చేసే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకుంటారు కానీ.. వాళ్లు కొనాలనుకున్న సమయానికి మార్కెట్ లో మంచి ఫోన్లు ఉండవు. మార్కెట్ లోకి మంచి ఫోన్లు వచ్చినప్పుడు బడ్జెట్ ఉండదు. అయితే.. బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు మీ బడ్జెట్ లోనే పొందొచ్చు. 15 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఏవో.. వాటి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.
Best Gaming Smartphones – Poco M3 Pro 5G

పోకో ఎం3 ప్రో 5జీ ఫోన్ మీ బడ్జెట్ ఫోన్, అత్యాధునికమైన గేమింగ్ ఫీచర్స్ కలిగిన ఫోన్. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ గేమింగ్ కు అద్భుతంగా ఉపయోగపడుతుంది. 6 జీబీ ర్యామ్, ఎంఐయూఐ అనే ఫీచర్.. కేవలం గేమింగ్ కోసమే యాడ్ చేశారు. అలాగే.. 48 మెగాపిక్సల్ త్రిపుల్ బ్యాక్ కెమరా ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే.. 5జీ ఫోన్ కావడంతో.. గేమ్స్ ఆడేవాళ్లకు ఈ ఫోన్ సూపర్బ్ గా సరిపోతుంది. ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర కేవలం 13,999 రూపాయలు.
Micromax IN 1

ఐఎన్ బ్రాండ్ తో వచ్చిన మైక్రోమాక్స్ ఫోన్ 1 గేమింగ్ వాళ్లకు బెస్ట్ మొబైల్ ఫోన్. మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత. కేవలం గేమింగ్ ఆడేవాళ్లకు ఈ ప్రాసెసర్ బాగా పనిచేస్తుంది. అలాగే.. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు పవర్ ఫుల్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌తో వస్తున్న ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర 10,499 రూపాయలు మాత్రమే. బడ్జెట్ లో గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే.. ఈ ఫోన్ ను తీసుకోవచ్చు.
Motorola Moto G30

మోటరోలా ఫోన్స్ అన్నీ సపరేట్ నిఫ్టీ సాఫ్ట్ వేర్‌తో తయారు చేయబడతాయి. మోటో జీ 30 కూడా అదే సాఫ్ట్ వేర్‌తో తయారు చేసిందే. ఈ ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్ లో ఆ రేంజ్ ప్రాసెసర్ ఉండటం అనేది గ్రేట్ అనే చెప్పుకోవాలి. అలాగే.. 6.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే ఉన్న ఈ ఫోన్.. గేమింగ్ కు సరిగ్గా సరిపోతుంది. 5000 ఎంహెచ్ బ్యాటరీ ఉండటం వల్ల.. ఫోన్ చార్జింగ్ బ్యాకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర 10,999 రూపాయలు మాత్రమే.
Redmi Note 10

జియోమీ రెడ్మీ నోట్ సిరీస్‌లు ఎంత ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రెడ్మీ నోట్ 3, నోట్ 4 సేల్స్ అయితే విపరీతంగా జరిగాయి. ఆ తర్వాత మరిన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ.. జియోమీ.. రెడ్మీ సిరీస్‌లను వరుసగా విడుదల చేస్తూ పోయింది. తాజాగా రెడ్మీ నోట్ 10 ను గేమింగ్ కోసం బెస్ట్ ఫోన్‌గా తీసుకొచ్చింది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 678 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ, ఏఎంవో ఎల్ఈడీ డిస్ప్లే ఈ ఫోన్ బెస్ట్ ఫీచర్స్. గేమింగ్ కోసం బడ్జెట్లో దొరికే బెస్ట్ ఫోన్ ఇదే అని చెప్పొచ్చు. ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర 11,999 రూపాయలు.
Realme Narzo 30A

రియల్మీ నార్జో సిరీస్.. గేమింగ్ కోసం సూపర్ ఫోన్. 6.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లేతో 60 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ లాంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గేమింగ్ కోసం బెస్ట్ ఫోన్. బెస్ట్ గేమింగ్ అనుభవం కోసమే రియల్మీ యూఐ సాఫ్ట్ వేర్‌ను డిజైన్ చేశారు. ఈ ఫోన్ బేసిక్ మోడల్ 8,999 రూపాయాలకే లభిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

