World Photography Day 2021 : బడ్జెట్ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా?
15 నుంచి 20 ఏళ్ల కింద కెమెరా ఉన్నోడు గొప్పోడు. ఎవరి దగ్గరైనా కెమెరా ఉంటే.. చూసి మురిసిపోయేవాళ్లం. ఒక్క ఫోటో తీయవా? అని బతిమిలాడుకునేవాళ్లం. ఎక్కడికైనా టూర్‌కు వెళితే అక్కడ ఇన్స్టాంట్ ఫోటో తీసి ఇచ్చేవాళ్ల దగ్గర ఒక ఫోటో తీయించుకొని.. దాన్ని చూసి తెగ మురిసిపోయేవాళ్లం. కానీ.. ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ చేతుల్లో ఉందంటే.. ప్రపంచం గుప్పిట్లో ఉన్నట్టే. అరచేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఫోన్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో రకాల పనులు చేసుకునే వెసులుబాటు.. స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది.

అయితే.. బెస్ట్ కెమెరా ఫీచర్ ఉన్న ఫోన్ కావాలంటే దానికోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బడ్జెట్ ధరలోనే బెస్ట్ కెమెరా క్వాలిటీతో ఫోన్లు వస్తున్నాయి. వరల్డ్ ఫోటోగ్రఫీ డే 2021 సందర్భంగా బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ కెమెరా ఫీచర్ ఉన్న ఫోన్లు ఏంటో తెలుసుకుందాం.
Xiaomi Redmi Note 10 Pro Max

జియోమీ.. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్.. బెస్ట్ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. 108 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో ఈ ఫోన్ లభిస్తోంది. అలాగే.. 8 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ లాంటి బెస్ట్ కెమెరా ఫీచర్లతో 108 ఎంపీల రేర్ కెమెరాను ఈ ఫోన్‌తో అందిస్తున్నారు. అలాగే.. ఫ్రంట్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. దీని ధర కూడా రూ.19,999 మాత్రమే.
Poco X3 Pro

పోకో ఎక్స్3 ఫోన్ 48 ఎంపీ మెయిన్ ప్లస్ 8 ఎంపీ అల్ట్రా వైడ్ ప్లస్ 2 ఎంపీ మాక్రో ప్లస్ 2 ఎంపీ డెప్త్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 48 మెగాపిక్సెల్‌తో మెయిన్ కెమెరా లభిస్తుంది. అలాగే.. ధర కూడా రూ.20,000 మాత్రమే. కాబట్టి.. కేవలం ఫోటోల కోసం కావాలనుకునే వాళ్లు ఈ ఫోన్‌ను కొనొచ్చు.
Realme Narzo 30 Pro

రియల్మీ నార్జో 30 ప్రో ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 48 ఎంపీ మెయిన్ యూనిట్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యూనిట్, 2 ఎంపీ మాక్రో యూనిట్ కెమెరా ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రానున్న ఈ ఫోన్ ధర కేవలం రూ.15,999 మాత్రమే.
iQoo Z3

ఐక్యూ జెడ్3 ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 8 ఎంపీ అల్ట్రా వైడ్ ప్లస్ 2 ఎంపీ మాక్రో సెటప్‌తో ఉంటుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.19,990 మాత్రమే.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

