Battlegrounds Mobile India : బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లేయర్స్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ రివార్డ్స్ కోసం ఇలా చేయండి
పబ్జీ గేమ్ గురించి చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఆ గేమ్‌కు ఉన్న పాపులారిటీ అటువంటిది. పబ్జీని ఇండియాలో బ్యాన్ చేయడంతో.. అవే ఫీచర్లతో వచ్చింది దేశీయ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. ఈ యాప్ 5 కోట్ల డౌన్లోడ్స్ మార్క్‌కు చేరువలో ఉండటంతో.. క్రాఫ్టన్ కంపెనీ.. ప్లేయర్ల కోసం ఇప్పటికే స్పెషల్ రివార్డ్స్‌ను ప్రకటించింది. తాజాగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఇండిపెండెన్స్ డే మహోత్సవ్ అనే సరికొత్త ఈవెంట్‌ను ప్రారంభించింది.

ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 వరకు ఇండిపెండెన్స్ డే మహోత్సవ్ ఈవెంట్ కొనసాగనుంది. దీనిలో భాగంగా.. ఆగస్టు 20 వరకు ప్రతిరోజూ లాగిన్ అవుతూ ఉన్న ప్లేయర్లకు స్పెషల్ రివార్డ్స్‌ను అందించనుంది. చివరి రోజున అంటే.. ఆగస్టు 20న ప్లేయర్లు అందరికీ AWM sniper rifle skin రివార్డును అందించనున్నట్లు క్రాఫ్టన్ వెల్లడించింది.
దానితో పాటు.. in-game currency, Classic Crate Coupon Scrap, Green parachute trail, Supply Crate Coupon లాంటి రివార్డ్స్ ప్రతి రోజు అన్‌లాక్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ యాప్ 49 మిలియన్ డౌన్లోడ్స్ మార్క్‌ను సాధించింది. 50 మిలియన్ డౌన్లోడ్స్ కాగానే.. ప్లేయర్ల కోసం మరికొన్ని స్పెషల్ రివార్డ్స్‌ను క్రాఫ్టన్ సిద్ధం చేసి పెట్టింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్‌ను జులై 2న లాంచ్ చేశారు. యాప్ లాంచ్ అయిన వారం రోజుల్లోనే 34 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యాయి. ఈ నెలలో ఐవోఎస్ యూజర్లకు యాప్‌ను లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

