Battlegrounds Mobile India : యాప్ డౌన్‌లోడ్స్‌లో బ్యాటిల్‌గ్రౌండ్స్ చరిత్ర… త్వరలోనే ఐవోఎస్ యాప్
పబ్జీ గేమ్ తెలుసు కదా. ఇప్పటి వరకు ఏ గేమ్‌కు రాని రెస్పాన్స్ ఆ గేమ్‌కు వచ్చింది. కానీ.. ఆ యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేయడంతో పబ్జీ లవర్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. అయితే.. అవే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. దాన్నే బీజీఎంఐ యాప్ అని కూడా అంటారు. పబ్జీ ఫీచర్లతోనే దేశీయ యాప్‌ను డెవలప్ చేసి ముందు ఆండ్రాయిడ్ యాప్‌ను విడుదల చేశారు.

ఈ యాప్‌కు బాగా రెస్పాన్స్ వచ్చింది. గత జులై 2న ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో రిలీజ్ చేయగా.. విడుదలైన వారం రోజుల్లో లక్షల్లో ప్లేయర్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. తాజాగా ఈ యాప్ 50 మిలియన్ డౌన్లోడ్స్ మార్క్‌ను చేరుకుంది. 50 మిలియన్ అంటే 5 కోట్ల డౌన్లోడ్స్ అన్నమాట. అది కూడా కేవలం యాప్ రిలీజ్ అయిన రెండు నెలల లోపే.
50 మిలియన్ డౌన్లోడ్ మార్క్‌ను చేరుకున్నందుకు క్రాఫ్టన్ కంపెనీ.. ఈ గేమ్ ప్లేయర్లకు స్పెషల్ రివార్డ్స్‌ను అందించింది. ఈ మైల్స్టోన్ రీచ్ అయినందుకు Galaxy Messenger Set రివార్డ్‌ను ప్లేయర్లకు అందించారు. అలాగే.. మరికొన్ని రివార్డ్స్‌ను కూడా క్రాఫ్టన్ ప్రకటించింది.
ఇండియాలో బ్యాన్ అయిన పబ్జీ యాప్‌ను 180 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఒక్క ఇండియాలోనే 33 మిలియన్ల యూజర్లు పబ్జీకి ఉన్నారు. గత మార్చిలోనే పబ్జీ 1 బిలియన్ డౌన్లోడ్ మార్క్‌ను క్రాస్ చేసింది.
త్వరలోనే యాపిల్ ఫోన్లలోనూ బ్యాటిల్‌గ్రౌండ్స్
త్వరలోనే ఐవోఎస్ వర్షన్ బ్యాటిల్‌గ్రౌండ్స్ యాప్‌ను విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఓఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐవోఎస్ ఓఎస్‌లో ఈ నెలాఖరు వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాటిల్‌గ్రౌండ్స్ ఇండిపెండెన్స్ డే మహోత్సవ్‌ను ప్రారంభించింది. ఆగస్టు 11 నుంచి 20 వరకు ఈ మహోత్సవ్ కొనసాగనుంది. దీనిలో భాగంగా.. ప్లేయర్లకు ఉచితంగా రివార్డ్స్‌ను ప్రకటించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

