Battlegrounds Mobile India : 50 మిలియన్ డౌన్ లోడ్స్కు చేరువలో గేమింగ్ యాప్.. స్పెషల్ రివార్డ్స్ ప్రకటన
పబ్బీ పేరు చెప్పగానే యూత్ రోమాలు ఒక్కసారిగా నిక్కపొడచుకుంటాయి. అప్పట్లో యూత్ మొత్తం పబ్జీ గేమ్‌కు అతుక్కుపోయేది. పబ్జీ గేమ్‌లోనే మునిగి తేలేవారు. కానీ.. పబ్జీ లవర్స్‌ను షాక్‌కు గురి చేస్తూ భారత ప్రభుత్వం.. ఆ యాప్‌ను భారత్‌లో నిషేధించింది. పబ్జీ యాప్.. ఆగిపోయాక.. అవే ఫీచర్స్‌తో మళ్లీ భారత మార్కెట్లోకి వచ్చిన యాప్.. బీజీఎంఐ.. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. ఇండియాలోనే దీన్ని తయారు చేశారు. సేమ్ టు సేమ్.. పబ్జీ ఫీచర్స్‌తోనే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ యాప్‌ను జులై 2న రిలీజ్ చేశారు. అయితే… యాపిల్ యూజర్ల కోసం మాత్రం ఇంకా ఈ యాప్‌ను విడుదల చేయలేదు. కేవలం ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంది. యాపిల్ యాప్ స్టోర్‌లో త్వరలో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

అయితే.. తాజాగా బీజీఎంఐ.. 50 మిలియన్ డౌన్ లోడ్స్ మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్స్ 47 మిలియన్లు అయ్యాయి. అంటే.. 4.7 కోట్ల డౌన్ లోడ్స్ అన్నమాట. త్వరలోనే 50 మిలియన్ల(5 కోట్లు) డౌన్లోడ్ మార్కును చేరుకోగానే.. యూజర్ల కోసం స్పెషల్ రివార్డ్స్‌ను ప్రకటిస్తున్నట్టు బీజీఎంఐ వెల్లడించింది.
ఒకసారి 48 నుంచి 49 మిలియన్ డౌన్లోడ్ మార్క్ చేరుకోగానే యూజర్ల కోసం three supply coupon crate scrap రివార్డును అందించనుంది. యాప్ డౌన్లోడ్స్ 50 మిలియన్ల మార్క్ చేరుకోగానే.. permanent Galaxy Messenger రివార్డును అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
రివార్డ్స్ కోసం యూజర్లు ఒకసారి యాప్‌ను చెక్ చేసుకుంటే చాలు.. ఆటోమెటిక్‌గా రివార్డ్స్ యూజర్ల అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. బీఎమ్జీఐ ఈవెంట్స్ సెక్షన్లో రివార్డ్స్ అందుబాటులో ఉంటాయని క్రాఫ్టన్ సంస్థ వెల్లడించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

