వినికిడికి గబ్బిలం ట్రీట్మెంట్!

- వినికిడి సమస్యకు పరిష్కారం చూపిన గబ్బిలాలు
- ‘ఐఎస్ఎల్1’ జన్యుపదార్థంతో సమూల పరిష్కారం
- గుర్తించిన చైనా పరిశోధకులు.. త్వరలోప్రయోగాలు
ప్రపంచవ్యాప్తంగా వినికిడి సమస్య ఉన్నవారు 43 కోట్ల మంది. మొత్తం జనాభాలో ఇది 5 శాతం.
2050 నాటికి వినికిడి లోపంతో బాధపడేవారు 70 కోట్ల మంది (డబ్ల్యూహెచ్వో అంచనా)
శాస్త్ర-సాంకేతిక రంగంలోని ప్రధాన ఆవిష్కరణలు ప్రకృతిలోని జీవరాశుల నుంచి స్ఫూర్తిపొంది రూపొందించినవే. గాలిలో ఎగిరే పక్షులను చూసి విమానాలను, నీటిలో ఈదే చేపలను ఆధారంగా చేసుకొని ఓడల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, జీవన పోరాటంలో భాగంగా ఆహారం కోసం వెదుక్కునే ఓ గబ్బిలం.. ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మందిని వేధిస్తున్న వినికిడి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించిందంటే నమ్మగలమా? ఇది నిజం.
యంత్రాల ద్వారా వినికిడి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించినప్పటికీ, శాశ్వతమైన చికిత్స కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాత్రిపూట, దట్టమైన చీకటి ప్రాంతాల్లో ఆహారం కోసం వెదికే గబ్బిలాలు ఎకోలొకేషన్ టెక్నిక్తో (ప్రతిధ్వనుల సాయంతో ఆహారం, పరిసరాల ఆనవాళ్లను చీకట్లోనే అంచనా వేయడం) చేస్తున్న కొన్ని ధ్వనులను చైనాలోని శాస్త్రవేత్తలు పరిశీలించారు.140 డెసిబెల్స్ రేంజ్లో (జెట్ విమానం చేసే శబ్దం) ఉన్న ఆ ధ్వనులను తట్టుకొని కూడా వినికిడి సమస్యలేకుండా ఆ జీవులు ఎలా ఉంటున్నాయో వారికి అర్థంకాలేదు. దీంతో లోతుగా ప్రయోగాలు చేశారు. (80 డెసిబెల్స్ కంటే ఎక్కువ తీవ్రత గల ధ్వనులను క్షీరదాలు వింటే వాటిలో వినికిడి సమస్య తలెత్తుతుంది)
అదే కారణం..
ఎకోలొకేషన్ సాయంతో ఆహారాన్ని వెదుకుతున్న గబ్బిలాల చెవి అంతర భాగాల్లో ‘ఐఎస్ఎల్1 (ఐఎస్లెట్1)’ అనే ప్రత్యేక జన్యు పదార్థం తయారవుతున్నట్టు పరిశోధకులు గమనించారు. కఠోర ధ్వనుల నుంచి చెవిలోని కోచ్లియర్ హెయిర్ కణాలను (వినికిడి శక్తిని నియంత్రించే కణాలు) రక్షించడంలో ఇది సాయపడుతున్నట్టు గుర్తించారు. ఎకోలొకేషన్ సాయంతో ఆహారాన్ని వెదుకుతున్న గబ్బిలాలలాగే, పండ్లను తిని బతికే ఫ్రూట్ గబ్బిలాలు, ఎలుకలు కూడా ఈ కఠోర ధ్వనులను తట్టుకుంటాయో లేదోనని పరీక్షలు జరిపారు. రెండుగంటలపాటు 120 డెసిబెల్స్ రేంజ్లో తీవ్రమైన శబ్దాలను ప్రసారం చేశారు. దీంతో ఫ్రూట్ గబ్బిలాలు, ఎలుకల్లో వినికిడి సమస్య తలెత్తింది. ఆ జీవుల్లో ‘ఐఎస్ఎల్1’ జన్యు పదార్థం తయారవకపోవడంవల్లే ఇది జరుగుతున్నట్టు గుర్తించారు.‘ఐఎస్ఎల్1’ను వినికిడి సమస్యగల వారికి అందిస్తే సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని అంచనా వేశారు. త్వరలో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తామన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

