Apple iPhone SE 3 2022 | అతి తక్కువ ధరకే ఐఫోన్ ఎస్ఈ 3 2022 ఫోన్.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
అప్పుడే ఐఫోన్ కొత్త మోడల్ ఫోన్లను యాపిల్ లాంచ్ చేస్తుంటుంది. మధ్యలో ఎప్పుడైనా ఇతర సిరీస్‌లను, వాచ్‌లు, ఐపాడ్లను రిలీజ్ చేస్తుంటుంది
Apple iPhone SE 3 2022 | సాధారణంగా యాపిల్ సంస్థ ఈవెంట్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో జరుగుతుంది. అప్పుడే ఐఫోన్ కొత్త మోడల్ ఫోన్లను యాపిల్ లాంచ్ చేస్తుంటుంది. మధ్యలో ఎప్పుడైనా ఇతర సిరీస్‌లను, వాచ్‌లు, ఐపాడ్లను రిలీజ్ చేస్తుంటుంది. ఇప్పటికే ఐఫోన్ 13 సిరీస్‌ను యాపిల్ లాంచ్ చేసింది. త్వరలో ఐఫోన్ ఎస్ఈ 3 2022 మోడల్‌ను రిలీజ్ చేసేందుకు సమాయత్తం అవుతోంది.
మార్చి 2022లో ఐఫోన్ ఎస్ఈ 3 ని యాపిల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. వచ్చే మార్చి కానీ.. ఏప్రిల్‌లో కానీ యాపిల్ స్ప్రింగ్ ఈవెంట్ జరగనుంది. ఆ ఈవెంట్లోనే ఎస్ఈ 2022 ఫోన్‌ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఎస్ఈ 2020 మోడల్ ఫోన్లో ఉన్న ఫీచర్ల కంటే బెస్ట్ ఫీచర్లను ఈ ఫోన్లో యాపిల్ తీసుకురానుంది. ఈ ఫోన్‌ను అతి తక్కువ ధరకే అందించాలని యాపిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కేవలం 300 డాలర్లకే ఈ ఫోన్‌ను యాపిల్ అందించనుందట. అంటే మన కరెన్సీలో రూ.22 వేలు మాత్రమే. 22 వేలలో యాపిల్ ఫోన్‌ను కొనడం అంటే అది నిజంగా తక్కువ ధరే అని చెప్పుకోవాలి. అలాగే.. ఈ ఫోన్ బెటర్ ప్రాసెసర్, 5జీ సపోర్ట్, బెటర్ బ్యాటరీ లైఫ్, బెటర్ కెమెరాతో రానుంది.
4.7 ఇంచ్ డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్సెట్, ఎక్స్ 60 మోడెమ్, 5జీ సపోర్ట్, 4 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 12 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్ల దీంట్లో ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఐఫోన్ ఎస్ఈ 3 2022 ధర, స్పెసిఫికేషన్లను యాపిల్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

