రూ.24,900 కే యాపిల్ ఐఫోన్ 12.. డిస్కౌంట్ పొందాలంటే ఇలా చేయండి
నిజంగానే మీరు ఈ పని చేస్తే రూ.24 వేలకే ఐఫోన్ 12ను చేజిక్కించుకోవచ్చు. నిజానికి.. ఐఫోన్ 12 ఒరిజినల్ ధర రూ.65,900
ఎట్టెట్టా.. రూ.24 వేలకే ఐఫోన్ 12 ను అమ్ముతున్నారా? మా చెవిలో పువ్వులు పెడుతున్నారా ఏంటి.. అని అనకండి. ఎందుకంటే.. నిజంగానే మీరు ఈ పని చేస్తే రూ.24 వేలకే ఐఫోన్ 12ను చేజిక్కించుకోవచ్చు. నిజానికి.. ఐఫోన్ 12 ఒరిజినల్ ధర రూ.65,900. కానీ.. ప్రస్తుతం ఈ ఫోన్ మీద రూ. 41000 డిస్కౌంట్ పొందొచ్చు.
యాపిల్ ప్రొడక్ట్స్ సేల్స్ నిర్వహించే యాప్ట్రానిక్స్ అనే రీసెల్లర్ షోరూమ్‌లో 64 జీబీ వేరియంట్ ఐఫోన్ 12ను రూ.24,900 కే దక్కించుకోవచ్చు. దాని కోసం కొన్ని రకాల డిస్కౌంట్లను యాప్ట్రానిక్స్ అందిస్తోంది. ముందు రూ.9,900 ఫ్లాట్ డిస్కౌంట్‌ను యాప్ట్రానిక్స్ అందిస్తోంది. అంటే… 9900 రూపాయలు తగ్గి ఫోన్ ధర రూ.56,000 అవుతుంది. ఆ తర్వాత ఐసీఐసీఐ, కొటక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి మరో రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. అంటే.. రూ.51 వేలకు ఫోన్ ధర వచ్చేసింది. ఆ తర్వాత మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే గరిష్ఠంగా రూ.23,100 వరకు పొందొచ్చు. ఐఫోన్ 11ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.23,100 వరకు పొందొచ్చు. అలాగే.. యాప్ట్రానిక్స్ బోనస్‌గా రూ.3000 అందిస్తోంది. అన్ని డిస్కౌంట్లు పోను.. రూ.24,900 కే ఐఫోన్ 12ను కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 12ను ఈ ధరకే కొనుగోలు చేశాక.. యాప్ట్రానిక్స్ కస్టమర్లకు రూ.5 వేల విలువైన ఈ ఓచర్లను కూడా అందిస్తోంది. అయితే.. ఈ ఆఫర్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న యాప్ట్రానిక్స్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో ఈ ఆఫర్‌ను వేరే ప్రాంతాల్లో కూడా విస్తరించే యోచనలో యాప్ట్రానిక్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

