రూ.31 వేలకే ఐఫోన్ 11.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్
దీంతో ఐఫోన్ 12, ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను డిమాండ్ తగ్గింది. దీంతో యాపిల్ సంస్థ వాటి ధరలను భారీగా ఇదివరకే తగ్గించింది.
యాపిల్ సంస్థ గత సంవత్సరం ఐఫోన్ 13ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 13 లో ఉండే లేటెస్ట్ ఫీచర్ల వల్ల వాటి సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఐఫోన్ 12, ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను డిమాండ్ తగ్గింది. దీంతో యాపిల్ సంస్థ వాటి ధరలను భారీగా ఇదివరకే తగ్గించింది. ఐఫోన్ 12, ఐఫోన్ 11ను ఫెస్టివల్ సీజన్ టైమ్‌లో సగం ధరకు కూడా అందించింది.
తాజాగా ఐఫోన్ 11పై మరోసారి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. 2019లో రిలీజ్ అయిన ఐఫోన్ 11.. 6.1 ఇంచ్ రెటినా డిస్ప్లేతో విడుదలైంది. యాపిల్ ఏ13 బయోనిక్ చిప్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌లాంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర 2019లో రూ.64,900 గా ఉండేది. కానీ.. ఇప్పుడు ఎంఆర్పీ ధర రూ.49,900గా ఉంది. కానీ.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సంస్థలలో ఆ ఫోన్‌ను కేవలం రూ.31 వేలకే పొందొచ్చు.
అమెజాన్‌లో ఐఫోన్ 11పై రూ.15 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లపై అదనంగా రూ.4000 డిస్కౌంట్ కూడా వస్తుంది. సో.. అన్ని క్యాష్‌బ్యాక్, ఇతర ఆఫర్లు పోను.. కేవలం రూ.30,900 కే అమెజాన్‌లో ఐఫోన్ 11ను కొనుగోలు చేయొచ్చు.
అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కనీసం రూ.18,850 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి రూ.31,050 కు పొందొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

