Apple | యాపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్ : పే ల్యాటర్ లాంఛ్
యాపిల్ (Apple) యూజర్లకు టెక్ దిగ్గజం తీపికబురు అందించింది. యూజర్ల కోసం యాపిల్ పే ల్యాటర్ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం పొందే వెసులుబాటు ఉంది.
న్యూయార్క్ : యాపిల్ (Apple) యూజర్లకు టెక్ దిగ్గజం తీపికబురు అందించింది. యూజర్ల కోసం యాపిల్ పే ల్యాటర్ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం పొందే వెసులుబాటు ఉంది. ఈ సర్వీస్ ద్వారా ప్రోడక్ట్స్ కొనుగోలుపై యూజర్లు ఇన్స్టాల్మెంట్స్లో యూజర్లు చెల్లింపులు చేపట్టవచ్చు.
ఇప్పుడు కొని, తర్వాత చెల్లించడమనే కాన్సెప్ట్‌కు అనుగుణంగా అమెరికన్ల కోసం యాపిల్ పే ల్యాటర్ను యాపిల్ లాంఛ్ చేసింది. ఆరు వారాల్లో నాలుగు వాయిదాల రూపంలో ఈ రుణాలను యూజర్లు తిరిగి చెల్లించవచ్చు. యాపిల్ పే పేమెంట్ పద్ధతిని ఆమోదించిన వ్యాపారుల నుంచి యూజర్లు ఈ లోన్స్‌ను ఆన్లైన్, యాప్ కొనుగోళ్ల కోసం తమ ఐఫోన్, ఐప్యాడ్లపై పొందవచ్చు.
ఇక ఈ చెల్లింపులను యూజర్ యాపిల్ వాలెట్ పర్యవేక్షిస్తుండటంతో యూజర్లు తాము ఎంత ఖర్చు చేస్తున్నామనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వీలుంది. యాపిల్ పే ల్యాటర్ ప్రీ-రిలీజ్ వెర్షన్‌ను యాక్సెస్ చేసుకునేందుకు ఎంపిక చేసిన యూజర్లను యాపిల్ ఆహ్వానిస్తుందని కంపెనీ ప్రకటించింది. మరో రెండు నెలల్లో అర్హులైన యూజర్లందరికీ ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోంది.
Read More :
I-Phone 14 Discounts | ఐఫోన్-14లపై రూ.15 వేలు డిస్కౌంట్.. 10 నుంచి డెలివరీ ప్రారంభం
Meta | మాస్ లేఆఫ్స్ అనంతరం బోనస్ చెల్లింపుల్లో కోత
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- Apple Pay Later
- Launch
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

