Android 13 | త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఆండ్రాయిడ్ 13.. ఏ ఫోన్లలో ముందుగా రానుందో తెలుసా?
మిగితా అన్ని స్మార్ట్ఫోన్ల బ్రాండ్స్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నాం. ఆండ్రాయిడ్ మార్కెట్ చాలా పెద్దది
Android 13 | ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్మార్ట్ఫోన్లలో వాడుతున్నాం. యాపిల్ ఐఫోన్స్ తప్పించి.. మిగితా అన్ని స్మార్ట్ఫోన్ల బ్రాండ్స్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నాం. ఆండ్రాయిడ్ మార్కెట్ చాలా పెద్దది. అందుకే.. ఎప్పటికప్పుడు ఓఎస్‌లో ఉన్న బగ్స్‌ను రెక్టిఫై చేస్తూ.. సరికొత్తగా ఫీచర్స్‌ను యాడ్ చేస్తూ అప్‌గ్రేడెడ్ ఓఎస్‌ను తీసుకొస్తోంది గూగుల్.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 ఓఎస్ మీద గూగుల్ పని చేస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 13 డెవలపర్ ప్రివ్యూ వన్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ప్రైవసీ, సెక్యూరిటీతో పాటు డెవలపర్ ప్రొడక్టివిటీ కోసం ఆండ్రాయిడ్ 13ను గూగుల్ డెవలప్ చేస్తోంది. ఇటీవలే ఆండ్రాయిడ్ 12 ఎల్ వర్షన్ అప్డేట్స్ను గూగుల్ ఫిక్స్ చేసింది. ఇంతలోనే ఆండ్రాయిడ్ 13 వర్షన్ ప్రివ్యూ వన్ను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతోంది.
ఆండ్రాయిడ్ యాప్స్ డెవలపర్ల కోసం ముందుగా ఆండ్రాయిడ్ 13 డెవలపర్ ప్రివ్యూ వన్ను గూగుల్ రిలీజ్ చేయనుంది. అంటే ఇది డెవలపర్ వర్షన్ అన్నమాట. ముందుగా ఇది గూగుల్ పిక్సెల్ డివైజ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ స్టూడియోలోని ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ద్వారా డెవలపర్ వర్షన్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
అయితే.. ఆండ్రాయిడ్ 13 డెవలపర్ ప్రివ్యూ వన్ను పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్, పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 4ఏ(5జీ), పిక్సెల్ 5, పిక్సెల్ 5ఏ 5జీ, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్లలో లాంచ్ కానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

