ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్!

Amazon Mobile Savings Days: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీగా ఆఫర్లను ప్రకటించాయి. సేవింగ్స్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీశాయి. తాజాగా అమెజాన్ మరో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్, నోకాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ వంటి ఆఫర్లను అందిస్తోంది. మొబైల్ సేవింగ్స్ డేస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ సేల్ జూన్ 12 వరకు ఉంటుంది.
ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రియల్మీ, శాంసంగ్, వివో, షియోమీ వంటి బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నది. ఒప్పో F17పై రూ.1,750 డిస్కౌంట్‌తో పాటు కూపన్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో నిర్వహించనున్న సేల్ ఈనెల 13 నుంచి 16 వరకు కొనసాగనుంది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్లను అందించనుంది. ఎస్బీఐ కార్డు ద్వారా షాపింగ్ చేసే వినియోగదారులకు 10శాతం ఇన్స్టాంట్ తగ్గింపును అందిస్తుంది.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

