లండన్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్ధ్యాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఏఐ టూల్స్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండగా లేటెస్ట్ టెక్నాలజీ పర్యవసానాలపై అప్రమత్తంగా ఉండాలని ఎలన్ మస్క్ వంటి టెక్ దిగ్గజాలు సూచిస్తున్నారు. లండన్‌లో ఇటీవల జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్ వేదికగా రాబోయే కాలంలో ఏఐతో ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్ధితి నెలకొంటుందని బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌తో మస్క్ పేర్కొన్నారు.స్పెయిన్‌కు చెందిన ఏజెన్సీ ది క్లూలెస్ అనే ఇన్ఫ్లుయెన్సీ ఏజెన్సీ ఏఐ మోడల్‌ను క్రియేట్ చేయడం చూస్తుంటే ఇది రాబోయే కాలంలో నిజమవుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఐతన లోపెజ్ పేరుతో 25 ఏండ్ల ఏఐ మోడల్‌ను క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచారు. పింక్ హెయిర్‌తో కనిపించే ఐతన లోపెజ్కు ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 1,22,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐతన లోపెజ్ బయటకు రావాలని కోరుతూ సెలబ్రిటీల నుంచి ఆమెకు ప్రైవేట్ మెసేజ్‌లు వస్తున్నాయని యూరోన్యూస్ వెల్లడించింది. తాము ఎలా పనిచేస్తున్నామో విశ్లేషించడం ప్రారంభించామని, అయితే తమ చేతిలో లేని కారణాలతో పలు ప్రాజెక్టులు నిలిపివేయడమో, రద్దవడమో జరుగుతున్నాయని, ఇవి ఇన్ఫ్లుయన్సర్, మోడల్ తప్పిదాలేనని గుర్తించామని, డిజైన్‌కు సంబంధించిన సమ్యలు కాదని ఏజెన్సీ ది క్లూలెస్ డిజైనర్ రూబెన్ క్రజ్ పేర్కొన్నారు.
వర్చువల్ మోడల్ నెలకు 10,000 యూరోల (రూ. 9 లక్షలు) వరకూ ఆర్జిస్తోంది. సగటున నెలకు 3000 యూరోలు (రూ.2.72 లక్షలు) ఆర్జిస్తోంది. ఇక తమను సంప్రదించే బ్రాండ్ల ప్రచారానికి ఏజెన్సీ ఏఐ మోడల్ ఐతానాను వాడుతుంది. ఐతానా వర్చువల్ మోడల్ అనే విషయం తెలియక కొందరు సెలబ్రిటీలు ఆమెను ఔటింగ్‌కు పిలుస్తుండటం విశేషం. ఐతానా వారం రోజుల పాటు ఏమేం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు దాన్ని క్రియేట్ చేసిన టీం ప్రతి వారం సమావేశమవుతుంది. ఏయే ప్రదేశాలను సందర్శించాలి, ఫొటోల అప్లోడింగ్పై ఈ బృందం నిర్ణయం తీసుకుంటుంది. ఇక వర్చువల్ మోడల్స్ రాకతో కొన్ని మోడల్స్, ఇన్ఫ్లుయన్సర్ల ఉపాధి ప్రశ్నార్ధకమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More :
IT Raids | తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి సోదరుని ఫ్యాక్టరీపై ఐటీ దాడులు..