స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సాఫ్ట్‌డ్రింక్ దిగ్గజం : మార్చిలో కోకాకోలా ఫోన్ లాంఛ్
సాఫ్ట్‌డ్రింక్ కంపెనీ కోకాకోలా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. కోకాకోలా ఫోన్‌తో కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాగిస్తోంది.
న్యూఢిల్లీ : సాఫ్ట్‌డ్రింక్ కంపెనీ కోకాకోలా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. కోకాకోలా ఫోన్‌తో కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాగిస్తోంది. బాటిల్స్ నుంచి నేరుగా మన పాకెట్లో సందడి చేసేలా స్మార్ట్‌ఫోన్ తయారీని కోకాకోలా చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో కోకాకోలా భారత్‌లో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేస్తుందని సమాచారం. కోకాకోలా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ తొలుత షేర్ చేశారు.
అప్‌కమింగ్ డివైజ్‌ను ఆయన షేర్ చేయగా ఈ స్మార్ట్‌ఫోన్ కోకాకోలా బ్రాండ్ ఐకానిక్ రెడ్ కలర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కనిపించింది. ఈ క్వార్టర్‌లోనే భారత్‌లోకి ఈ డివైజ్ రానుంది..ఈ న్యూ ఫోన్ కోసం కోకాకోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో భాగస్వామ్యంతో ముందుకొచ్చిందని ఈ పోస్ట్‌కు శర్మ క్యాప్షన్ ఇచ్చారు. భారత్‌లో కోకాకోలా థీమ్‌తో కూడిన ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సహకరించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నేమ్‌ను ఆయన వెల్లడించలేదు.
బేవరేజెస్ మార్కెట్లో సత్తా చాటిన కోకాకోలా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. లీకైన ఇమేజ్‌లో కోకాకోలా డివైజ్ రియల్‌మి డిజైన్‌ను పోలి ఉంది. రియల్‌మి 10 ప్రొ 4జీని ఇది తలపించేలా ఉంది. వెనుకభాగంలో ఈ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ ఫోన్ కెమెరా సెన్సర్ కలిగిఉంది. కోకాకోలా ఫోన్ ఫీచర్లను ముకుల్ శర్మ వెల్లడించకున్నా బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్ లక్ష్యంగా కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Coca Cola
- oft drink
- SMARTPHONE
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

