Afghanistan : గూగుల్ హిస్టరీలోనే తక్కువ టైమ్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన కీవర్డ్.. ఇదే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అఫ్ఘనిస్థాన్, తాలిబన్లు. అప్ఘాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకొని.. అక్కడ సృష్టిస్తున్న అరాచకాలు మామూలుగా లేవు. అప్ఘాన్ దేశాన్ని తమ వశపరుచుకొని అప్ఘాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడే తాలిబన్లకు తలవంచి… దేశం వదిలి పారిపోయాడు. దీంతో అప్ఘనిస్థాన్ ప్రజలు కూడా దేశం వదిలి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈనేపథ్యంలో ప్రపంచమంతా.. అప్ఘాన్ వైపు చూసింది. అసలు.. అప్ఘనిస్థాన్‌లో ఏం జరుగుతుందోనని అందరూ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు. దీంతో గూగుల్ సెర్చ్‌లో అప్ఘనిస్థాన్, తాలిబన్ కీవర్డ్స్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. గత కొన్ని రోజుల నుంచి గూగుల్‌లో అప్ఘనిస్థానే ట్రెండింగ్ టాపిక్.

గూగుల్ ట్రెండ్స్ హిస్టరీలోనే ఇంత తక్కువ టైమ్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన కీవర్డ్ లేదు. కానీ.. ఎప్పుడైతే తాలిబన్లు.. అప్ఘాన్‌ను ఆక్రమించడం మొదలు పెట్టారో.. అప్ఘనిస్థాన్‌తో పాటు, తాలిబన్ అనే కీవర్డ్ కూడా గూగుల్‌లో ట్రెండ్ అవుతూ వచ్చింది. గూగుల్‌తో పాటు.. సోషల్ మీడియా నెట్వర్క్స్ అయిన ట్విట్టర్, ఫేస్బుక్లో ట్రెండ్ అయ్యాయి ఈ టాపిక్స్.

2004 నుంచి అప్ఘనిస్థాన్(Afghanistan) అనే కీవర్డ్ సెర్చ్‌ను గూగుల్ ట్రెండ్స్‌లో చూస్తే.. 2004 నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఒకేవిధంగా ఉన్నట్రెండ్.. తాలిబన్లు ఎప్పుడైతే అప్ఘనిస్థాన్ను ఆక్రమించడం మొదలు పెట్టారో అప్పుడు ఒక్కసారిగా ఎగబాకింది.

అఫ్ఘాన్, యూఎస్‌కు సంబంధించి.. టాప్ 5 ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఇవే. Airbnb Afghan Refugees, Trump sending plane to Afghanistan, Jocko Willink Video Afghanistan, Seth Moulton Afghanistan and Seth Moulton లాంటి కీవర్డ్స్ ఎక్కువగా సెర్చ్ చేయబడ్డాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

