Ibrahimpatnam : గడపగడపకు సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- పూర్తయిన గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు
- ఈ నెల 20న మండల, మున్సిపల్ కమిటీల ఎన్నిక

ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రజల గడపగడపకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన టీఆర్ఎస్ ప్రభలమైన శక్తిగా ఎదిగిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సంక్షేమ పథకాలు నాయకుల జేబులు నింపేవని, ఇప్పుడు ప్రజల కడుపులు నింపుతున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంతెంత ఎగిరిపడినా ప్రజలు వారిని గుర్తించడం లేదన్నారు. 87 మున్సిపల్ వార్డులకు, 79 గ్రామాలకు బలమైన కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యిందని, సమన్వయంతో పని చేసిన నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ నెల 20న మండల, మున్సిపల్ కమిటీలను ఎన్నుకుంటామని పూర్తి కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలను నియమిస్తామని తెలిపారు.
సామాజిక సమీకరణాలు, పార్టీ, నాయకత్వం, విధేయత, ప్రజల పట్ల అంకితభావం కలిగిన వారిని పార్టీ పదవులకు ఎంపిక చేస్తామని వివరించారు. పూర్తి సమయమిచ్చి పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే సీనియర్ నాయకులకు ప్రభుత్వం నామినేటెడ్ పదవులతో పాటు జిల్ల కమిటీల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, అంజిరెడ్డి, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

