Vikarabad : నిత్యం ప్రజా సేవలో.. మీతో నేను అంటున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

ధారూరు : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మిషన్‌భగీరథ లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని, నీరు కలుషితం కాకుండా చూడాలని అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ, 5వ వార్డులను మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని గాంధీకాలనీ, శివరెడ్డిపేట్ కాలనీల్లో ఉన్న సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శివరెడ్డి పేట్‌లోని బావిలో పెరిగిన చెట్లను తొలగించి యథావిధిగా బావి పైకప్పును ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో కొన్ని చోట్ల ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి నూతన తీగలను ఏర్పాటు చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, పార్టీ నాయకులు, పాల్గోన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

