Vikarabad : విద్యుత్ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి.. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట మండలాల్లోని గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కార చర్యలు ఎంతవరకు వచ్చాయని తెలుసుకుని, వాటిని పూర్తిస్థాయిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో కొత్త స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల చుట్టు కంచెలు ఏర్పాటు చేయాలని, పంట పొలాల వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలన్నారు.
గ్రామాల్లో వీధి దీపాల ఆన్/ఆఫ్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో వీధి దీపాలు లేవని, వాటిని తొందరగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీ చంద్రకళ, మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, ఎంపీవో నాగరాజు, సర్పంచ్‌లు పురుషోత్తం, ఆంజనేయులు, తిరుపతిరెడ్డి, మాదవరెడ్డి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

