విశాలమైన స్థలాల్లో పల్లెపల్లెలో క్రీడా ప్రాంగణాలు నిర్మించిన ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే 11 రకాల ఆటలకు సంబంధించిన వస్తువులను కిట్లుగా రూపొందించి పంపిణీ చేస్తున్నది. వీటిలో క్రికెట్, వాలీబాల్ క్రీడాసామగ్రితోపాటు మూ డుసెట్ల డంబెల్స్, డిస్కస్‌త్రో, ఆరు టెన్నికాయిట్ రింగులు, నాలుగు స్కిప్పింగ్ రోప్‌లు, కొలతలు కొలిచేందుకు టేపు, మూడు విజిల్స్, ఒక స్టాప్‌వాచ్, ఒక కిట్ బ్యాగ్, 75 టీషర్టులున్నాయి. క్రికెట్ కిట్‌లో రెండుబ్యాట్లు, రెండు జతల బ్యాటింగ్ గ్లవ్స్, ఒక జత వికెట్ కీపింగ్ గ్లవ్స్, రెండు జతల బ్యాటింగ్ గార్డ్స్, ఒక జత కీపింగ్ గార్డు, రెండు సెట్ల స్టంప్స్, ఆరు బాల్స్ ఉన్నాయి.
అదేవిధంగా వాలీబాల్‌కు సంబంధించి నాలుగు వాలీబాల్స్, ఒక నెట్, సైకిల్ పంపు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 542 క్రీడాప్రాంగణాలుండగా అన్నింటికీ ఈ కిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వికారాబాద్ జిల్లాకు 626 కిట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే ఈ కిట్లు ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాలకు చేరగా త్వరలోనే పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోని యువకులకు లాంగ్‌జంప్, సింగిల్ బార్, డబుల్ బార్లను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్రీడాప్రాంగణాల ఏర్పాటుతో యువకుల ఆటపాటలతో సందడిగా మారిన పల్లెలు ఈ కిట్లతో మరింత కోలాహలంగా మారనున్నాయి.
– షాబాద్, సెప్టెంబర్ 10
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 10 : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి కృషి చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన క్రీడారంగం సీఎం కేసీఆర్ కృషితో క్రీడలు, క్రీడాకారులకు మంచి రోజులు వచ్చాయి. గ్రామాల్లో పిల్లలు, యువకులు ఆడుకోవడానికి ప్రతి గ్రామంలో ఎకరం నుంచి అర ఎకరం స్థలాలను కేటాయించి తెలంగాణ క్రీడా ప్రాంగణాలను నిర్మించింది. వీటిలో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్‌త్రో వంటి ఆటలకు సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా ప్రతి గ్రామానికీ స్పోర్ట్స్ కిట్లను మంజూరు చేసింది. జిల్లాలోని 20 మండలాలకు అధికారులు వీటిని చేరవేశారు. అధికారుల ఆదేశాలు రాగానే మండల అధికారులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ యువకులు ఆడుకోవడానికి ప్రతిగ్రామంలోనూ ఒక మైదానం ఉండాలన్న ఉద్దేశంతో క్రీడా ప్రాంగణాలను నిర్మించారు. వికారాబాద్ జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉండగా, 469 గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను గుర్తించి రూ.4లక్షల వ్యయంతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఆడుకోవడానికి వీలుగా వాలీబాల్ వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్‌త్రో వంటి ఆటలకు సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. క్రీడాకారులకు అవసరమైన ఆట వస్తువులను కూడా ప్రభుత్వం ప్రతి గ్రామానికీ కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ల పేరుతో పంపిణీ చేస్తున్నది.
వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం 626 స్పోర్ట్స్ కిట్లను మంజూరు చేసింది. కిట్లలో క్రికెట్, వాలీబాల్, మూడు సెట్ల డంబెల్స్, డిస్కస్‌త్రో, 6 టెన్నికాయిట్ రింగులు, 4 స్కిప్పింగ్ రోప్లున్నాయి. వీటితో పాటు కొలతలు కొలవడానికి టేపు, 3 విజిల్స్, ఒక స్టాప్ వాచ్, ఒక కిట్ బ్యాగ్, 75 టీషర్టులు ఉన్నాయి. క్రికెట్ కిట్‌లో 2 బ్యాట్లు, రెండు జతల బ్యాటింగ్ గ్లవ్స్, ఒక జత వికెట్ కీపింగ్ గ్లవ్స్, రెండు జతల బ్యాటింగ్ గార్డ్స్, ఒక జత కీపింగ్ గార్డు, రెండు సెట్ల స్టంప్స్, ఆరు బాల్స్ తదితరాలు ఉన్నాయి. వాలీబాల్‌కు సంబంధించి నాలుగు వాలీబాల్స్, ఒక నెట్, సైకిల్ పంపు ఉన్నాయి.
షాబాద్, సెప్టెంబర్ 10 : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ఊరికో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించింది. అర ఎకరం నుంచి ఎకరం స్థలంలో అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 558 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం 542 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు తాజాగా గ్రామానికో కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ అందిస్తుంది. ఒక్కో స్పోర్ట్స్ కిట్‌లో 11 రకాల ఆటలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు ఉపయోగపడే వస్తువులతో పాటు వ్యాయామ పరికరాలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాకు మొత్తం 542 కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు వచ్చాయి. వీటిని ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో భద్రపర్చారు. మరో వారం రోజుల్లో మిగిలిపోయిన కిట్లు కూడా వస్తాయని, త్వరలోనే షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారీగా కిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 27 మండలాలున్నాయి. ఇందులో 558 గ్రామ పంచాయతీలుండగా, 542 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. లాంగ్ జంప్, సింగిల్బార్, డబుల్బార్లను ఏర్పాటు చేసి యువత వ్యాయామం చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించింది.
జిల్లా వ్యాప్తంగా 542 గ్రామాలకు 11 రకాల ఆటలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఇప్పటికే 542 కిట్లు రాగా, వీటిని సంబంధిత మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో భద్రపరిచారు. ప్రతి క్రీడా ప్రాంగణానికి అవసరమైన టీషర్టులు, క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు, మెజరింగ్ లేబుల్, డంబెల్స్, డిస్కస్ త్రోలు, టెన్నీ కాయిట్ రింగులు, స్కిప్పింగ్ రోప్‌లు, విజిల్స్, స్టాప్ వాచ్‌లతో పాటు ఇతర క్రీడా సామగ్రిని కిట్ల రూపంలో పొందుపరిచి సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషకరమని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషకరం. ఇప్పటికే ప్రతి గ్రామానికి ఒక క్రీడాప్రాంగణం ఏర్పాటు చేసి అందులో క్రీడలు ఆడుకునేలా మౌలిక వసతులు కల్పిస్తున్నది. తాజాగా 11 రకాల ఆటలకు సంబంధించిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ అందించడం మంచి పరిణామం. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి.
– ఏండీ ఇనాయత్, క్రీడాకారుడు, బోడంపహాడ్ (షాబాద్)
ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలకు స్పోర్ట్స్ కిట్లను సరఫరా చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 542 క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్స్ వచ్చాయి. వాటిని ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో భద్రపరిచాం. మరో వారం రోజుల్లో మిగతా కిట్లు కూడా రానున్నాయి. అన్ని వచ్చిన వెంటనే గ్రామాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కిట్లు పంపిణీ చేస్తాం.
– వెంకటేశ్వరరావు, రంగారెడ్డిజిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇది మంచి కార్యక్రమం. వాలీబాల్, ఖో-ఖో, టెన్నికాయిట్, స్కిప్పింగ్, డంబెల్స్ వంటి రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి. స్పోర్ట్స్ కిట్లను సద్వినియోగం చేసుకుని యువత ఆటల్లో రాణించాలి. జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాలకు ఇప్పటికే స్పోర్ట్స్ కిట్లను చేరవేశాం.
-హన్మంత్‌రావు, జిల్లా యువజన క్రీడల అధికారి