Shadnagar : ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలి
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్

షాద్‌నగర్ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన భాగ్యనగర ఉత్సవ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ మండపాల వద్ద భక్తులు కచ్చితంగా కొవిడ్ నిబందనలను పాటించాలని సూచించారు. మండపాల నిర్వాహాన పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదే అనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విగ్రహా నిమజ్జనోత్సవంలో ఎలాంటి అపశ్రుతులు జరుగకుండ అధికారులు చర్యలు తీసుకోవాలని, భక్తులు సహకరించాలని కోరారు. అధికారుల ఆదేశాలను కచ్చితంగా పాటించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ హరిప్రియ, డీసీపీలు, ఆర్డీఓలు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

