Rangareddy : దసరా పండుగ మన సంస్కృతికి నిదర్శనం.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్

షాద్‌నగర్ : దసరా పండుగ మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. శ్రీవాసవి మాత దేవాలయంలో శరనవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటితరం యువతకు తెలియజేయాలని చెప్పారు. అమ్మవారి కృపతో పాడి పంటలు పుష్కలంగా పండాలని, వ్యాపార అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదుగాలని, ప్రజా సేవాలో భాగస్వాములు కావాలని కోరారు.
ఇందులో భాగంగానే ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఆర్య వైశ్య సంఘం నాయకులు సరాపు రమేశ్, నందకిషోర్, బాదం సుధాకర్, శ్రీనివాస్‌గుప్తా, అనంత లక్ష్మీ, నవీన్, సురేష్, మొహన్‌రావు, వెంకటరమణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

