పతంగులు ఎగరేసేటప్పుడు నిర్లక్ష్యం వద్దు
ట్రాన్స్ఫార్మర్కు చిక్కిన పతంగిని తీసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదేండ్ల బాలుడు గతేడాది కరెంటు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. రెండో అంతస్తుపై పతంగి ఎగరేస్తూ గమనించకుండా కాలుజారి కిందపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. ఏటా సంక్రాంతి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్నే నింపుతున్నది
- జాగ్రత్తలు తీసుకోవాలి
- విద్యుత్తు తీగలు, ట్రాన్స్ఫార్మర్లతో జర భద్రం
- రోడ్లపై గాలిపటాల కోసం పరుగులు తీయొద్దు
- చెట్లు, భవనాలపై నుంచి ఎగిరేస్తే ప్రమాదం
- చైనా మంజాను వాడొద్దు
పెద్దఅంబర్‌పేట, జనవరి 11: ట్రాన్స్ఫార్మర్కు చిక్కిన పతంగిని తీసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదేండ్ల బాలుడు గతేడాది కరెంటు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. రెండో అంతస్తుపై పతంగి ఎగరేస్తూ గమనించకుండా కాలుజారి కిందపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. ఏటా సంక్రాంతి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్నే నింపుతున్నది. పండుగొచ్చిందంటే సంబురం తెస్తుంది. కానీ, కొంతమంది నిర్లక్ష్యం, అలసత్వంతో ఆయా కుటుంబాల్లో విషాదమే మిగులుతున్నది. దుఃఖానికి దారితీస్తున్నది. సం క్రాంతి అంటే ముత్యాల ముగ్గులు, పిండి వంటలే కాదు.. పతంగులు మరింత ప్రత్యేకం. పిల్లలు, యువత పతంగులను ఎగరేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే, గాలిపటాలు ఎగరేసే సమయంలో చిన్నపాటి అలసత్వం కూడా వారి ప్రాణాలపైకి తీసుకొస్తుంది. గాయాలపాలవుతున్న ఘటనలూ అనేకం చోటుచేసుకుంటున్నాయి. పతంగులు ఎగరేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

పతంగితో పైలం
- ఎదుటి వారి పతంగిని కట్ చేయాలనే ఆతృతతో చుట్టుపక్కల ఏముందో గమనించకుండానే పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి.
- రెయిలింగ్ లేని భవనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ పతంగులను ఎగరేయొద్దు. రెయిలింగ్ ఉన్న భవంతులపై కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఎగురవేయాలి.
- భవనాలపై గాలిపటాన్ని ఎగరేసేటప్పుడు సమీపంలో విద్యుత్తు తీగలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
- రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగరేయొద్దు.
- కట్ అయి ఎగిరిపోతున్న పతంగుల వెంట పరుగులు తీయొద్దు. ప్రమాదాలు జరుగుతాయి.
- కొన్నిసార్లు విద్యుత్తు తీగలకు పతంగులు చిక్కుకుంటాయి. దానికి సంబంధించిన మాంజాలు వేలాడుతుంటాయి. ఇవి ద్విచక్ర వాహనదారులకు తగిలి ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి.
- కట్ అయి విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, చెట్లు, ట్యాంకులకు చిక్కుకున్న పతంగుల జోలికి పోవొద్దు. వాటిని పట్టుకోవాలనే ఆలోచన ప్రమాదకరం.
- పిల్లలు పతంగులు ఎగరేస్తున్న సమయంలో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచించాలి.
- చైనా మాంజాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. ఇవి పతంగులు ఎగిరేసే వారితోపాటు అవతలి వారికి కూడా ప్రమాదాలను తెచ్చి పెడతాయి. వీటివల్ల పతంగులు ఎగరవేసే వారి చేతులు తెగే ప్రమాదం ఎక్కువ. మంజాలు పక్షులకు తగిలి అవి గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమదాలున్నాయి.
- మైదానాల్లోనే పతంగులను ఎగురవేయాలి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

