ఆరు నేలల్లో..ఆగమాగం
తెలంగాణ రాక ముందు గందరగోళంగా ఉన్న విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దితే..ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కరెంటు కష్టాలతో కన్నీరు పెట్టిస్తున్నదని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కృషితో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగిందని..రైతులు, వ్యాపారులు అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నామని నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు.
- నిరంతర వెలుగుల నుంచి అంధకారం వైపునకు..
- గందరగోళంగా విద్యుత్ సరఫరా బీఆర్ఎస్ హయాంలో
- నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందంటున్న ప్రజలు
- వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై అరోపణలు
- కరెంటు కోతలపై ఉమ్మడి జిల్లా వాసుల ఆగ్రహం
తెలంగాణ రాక ముందు గందరగోళంగా ఉన్న విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దితే..ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కరెంటు కష్టాలతో కన్నీరు పెట్టిస్తున్నదని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కృషితో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగిందని..రైతులు, వ్యాపారులు అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నామని నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరునెలలు గడువక ముందే వేళాపాళా లేని విద్యుత్ కోతలతో నానా కష్టాలు పెడుతున్నారని వాపోతున్నారు.
ఒక పక్క ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టించడానికి విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఎవ్వరూ నమ్మడం లేదు. విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పల్లెపల్లెలో కొత్త వెలుగులు నింపిన కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అస్తవ్యస్తమైన విద్యుత్ వ్యవస్థను సరిదిద్దకుండా తమ వైఫల్యాలను పాత ప్రభుత్వంపై నెడుతున్న కాంగ్రెస్ వైఖరిపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటుచర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా మెరుగు పరచాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్తు
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్తు అందింది. రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. వ్యాపారానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కేసీఆర్ పాలనలో విద్యుత్తు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలకు మేలు చేసిండు.
-రవి, వ్యాపారి, షాద్‌నగర్‌టౌన్
వ్యవసాయానికి ఇబ్బంది లేకుండే
తెలంగాణ రాక ముందు కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేది. కరెంట్ ఎప్పుడొస్తదో, ఎప్పడు పోతదో తెలిసేదికాదు. దీంతో పొలాల వద్ద పడిగాపులు కాసేవాళ్లం. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పుణ్యాన కరెంట్ కష్టాలు తీరాయి. నిరంతర కరెంట్‌తో రైతులందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు.
– రమేశ్‌యాదవ్, రైతు, సోలిపూర్, షాద్‌నగర్‌టౌన్
8 గంటల కోత విధిస్తున్నారు
గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు వ్యవసాయానికి 24గంటలూ కరెంటు ఇచ్చేవారు. ఎప్పుడు మోటర్ ఆన్చేసినా పోసేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక త్రిఫేజ్ కరెంటులో 8 గంటలు కోత విధిస్తున్నారు. దీంతో పొలం పారడం లేదు. కేసీఆర్ హయాంలో నిరంతర విద్యుత్తుతో దర్జాగా పంటలు పండించుకున్నాం.
– బ్రహ్మనందారెడ్డి, రైతు ఉప్పరిగూడ
కేసీఆర్ పాలనలోనే రైతులకు మేలు..
కేసీఆర్ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. అప్పుడు వ్యవసాయానికి 24 గంటలూ కరెంట్ అందేది. కాంగ్రెస్ పాలనతో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు సాయం, ఎరువులు సకాలంలో అందేవి. గృహాలకూ నిరంతర కరెంట్ అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
– వీరయ్య, రైతు, ముర్తూజపల్లి, ఆమనగల్లు
కేసీఆర్‌తోనే వ్యవసాయం పండుగైంది..
స్వరాష్ర్టానికి ముందు దండుగన్న వ్యవసాయం కేసీఆర్ పాలనలోనే పండుగలా మారింది. 24గంటల నాణ్యమైన కరెంట్, పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాలతో రైతుకే మేలు చేసిండు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఆయన పాలన సాగింది. కాంగ్రెస్ కక్షపూరిత ధోరణితో కరెంట్ విషయంలో కేసీఆర్‌ను తప్పు పట్టడం సరికాదు.
-గంగిడి భూపాల్‌రెడ్డి, రైతు, హైతాబాద్, షాబాద్ మండలం
స్వరాష్ట్రంలో విద్యుత్తు సమస్య తొలిగింది
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కృషితోనే విద్యుత్తు సమస్య తొలిగింది. 2014 సంవత్సరానికి ముందు గంటల తరబడి విద్యుత్తు నిలిచిపోయేది. స్వరాష్ట్రంలో కేసీఆర్ పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేశారు. విద్యుత్తు విషయమై కేసీఆర్‌ను బద్నాం చేయడం సరికాదు.
– వెంకటేశ్, ట్రాక్టర్ ట్రాలీ తయారీదారి, మన్నెగూడ, పూడూరు
నాణ్యమైన విద్యుత్తు అందేది..
2014 వరకు విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు, గృహోపకణాలు దగ్ధమయ్యేవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక చొరవ తీసుకొని నిరంతరం నాణ్యమైన విద్యుత్తు అందేలా చూశారు. అలాంటి నేతపై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. ఇప్పటికైనా ఈ కుతంత్రాలు మానుకొని నాణ్యమైన విద్యుత్తు సరఫరాపై దృష్టి పెట్టాలి.
-కమ్మరి నాగప్ప, మిట్టకోడూర్, పరిగి మండలం
కాంగ్రెస్ సర్కార్‌ది కక్షపూరిత ధోరణి..
వ్యవసాయానికి నిర్విరామంగా ఉచిత కరెంటు ఇచ్చిన కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత ధోరణి అవలంబిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందన్న సమైక్య నేతలకు కేసీఆర్ నిరంతర విద్యుత్తు సరఫరా చేసి షాకిచ్చాడు. కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తే ఉద్యమిస్తాం.
– జోగు గుణవర్దన్ ముదిరాజ్, మల్ల్లెపల్లి గ్రామం, దోమ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

