Chanda Nagar | పాపిరెడ్డికాలనీలో కార్డన్ సెర్చ్.. 51 బైక్‌లు, విదేశీ సిగరెట్లు స్వాధీనం..!
కొండాపూర్, నవంబర్ 22 : చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ (Papireddy Colony)లో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ (Cordon Search) చేపట్టారు. అనంతరం కాలనీవాసులతో కమ్యునిటీ కనెక్ట్ నిర్వహించారు.
కొండాపూర్, నవంబర్ 22 : చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ (Papireddy Colony)లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ (Cordon Search) చేపట్టారు. అనంతరం కాలనీవాసులతో కమ్యునిటీ కనెక్ట్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్(DCP Riti Raj) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ఎస్ఓటీ, ఉమెన్ సేఫ్టీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు 250 ఇండ్లలో తనిఖీలు చేపట్టారు.
ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి పాపిరెడ్డి కాలనీలో చాలామంది నివసిస్తున్నట్లు కార్డన్ సెర్చ్‌లో పోలీసులు గుర్తించారు. కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లో 635 మద్యం బాటిళ్లు, వివిధ షాపుల్లో నిషేదించిన 122 విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో 9 మంది అనుమానిత వ్యక్తులతో పాటు నలుగురు రౌడీ షీటర్లను గుర్తించారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లులేని 51 బైకులు, రెండు ఆటోలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఏడీసీపీ ఉదయ్‌రెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

