Schools Reopening | రేపట్నుంచే స్కూల్.. ఇండ్లలో మొదలైన పాఠశాలల పునః ప్రారంభ సందడి
మొన్నటివరకు సెల్ఫోన్ గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు.
యూనీఫాం ఇస్త్రీ చేసి ఉందా?
కొత్త షూకు లేస్ సరిగా ఉన్నాయా!
స్నాక్స్ తీసుకెళ్తావా?.. అదిగో.. అది మీ బస్సు హారనే.. లంచ్ బాక్సులో ఏం పెట్టమంటావు?
కంబాక్స్లో అన్నీ ఉన్నాయా?
టై, బెల్ట్, ఐడీకార్డు అన్నీ సరిచూసుకున్నావు కదా.!
బ్యాగ్లో అన్నీ పెట్టుకున్నావా!
వాటర్ బాటిల్ నిండుగా ఉన్నదా!
ఈ రోజు ఏయే సబ్జెక్టులు ఉన్నాయి!
దాదాపు 45 రోజుల సెలవులు అయిపోయాయ్. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి పొద్దెక్కాక లేచిన రోజులు ఇక ముగిశాయి. క్లాస్ బెల్, లంచ్ బాక్స్, స్కూల్ గేటు వేయకముందే లోపలికి పరుగులు తీసే రోజులు వచ్చేశాయి. దీంతో మళ్లీ పాఠశాలలకు సంబంధించిన పదజాలం వినిపించనున్నది.
Schools Reopening | మొన్నటివరకు సెల్ఫోన్ గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. ‘రేపట్నుంచే స్కూల్కు వెళ్లాలి. నువ్వు అడిగినవన్నీ కొనిచ్చానుగా.. వెళ్లేందుకు నువ్వు రెడీ కదా!’ అంటూ బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఫస్ట్ డే ఎలాగైనా స్కూల్కు వెళ్లాలని సూచిస్తున్నారు. అదే ఉత్సాహాన్ని ఏడాదంతా కొనసాగించాలని ఆరాటపడుతున్నారు. పిల్లల్లో ఉత్సాహం నింపేందుకు చాలామంది పేరెంట్స్ కొత్త బ్యాగ్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ఇప్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
పిల్లలకు చేసినవి గుర్తుచేస్తూ..
సెలవుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన పనులను ఈ సమయంలో తల్లిదండ్రులు గుర్తుచేస్తున్నారు. సెలవుల్లో యాత్రలకు తీసుకెళ్లాలని, సినిమాలు చూడాలని, బయట ప్రదేశాల్లో భోజనం చేయాలని పిల్లలు చేసిన డిమాండ్లను చాలా వరకు పేరెంట్స్ తీర్చేశారు. పిల్లల ఇష్టాలను తీర్చేందుకు ఆసక్తిచూపారు. వారి ఆసక్తులకు అనుగుణంగా ఎంతో సమయం వెచ్చించారు. పాఠశాలలు తెరుచుకోనుండడంతో ఇక విజ్ఞప్తులు, డిమాండ్ చేయడం తల్లిదండ్రుల వంతైంది. ‘పొద్దున్నే లేవాలి. నిద్ర లేచేందుకు ఇబ్బంది పెట్టొద్దు. త్వరగా నిద్రపోతే ఉదయమే లేచేందుకు అవకాశం ఉంటుంది’ అంటూ పిల్లలను పేరెంట్స్ బతిమిలాడుతున్నారు. పై తరగతికి వెళ్తున్న నేపథ్యంలో మరింత కష్టపడి చదివేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఉన్నత చదువుల్లో రాణిస్తున్నవారి గురించి పదే పదే పిల్లల ముందు ప్రస్తావిస్తున్నారు. దీంతో మరింత కష్టపడి చదవాలని పిల్లల్లో రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ఏం వండాలి.. ఎలా పెట్టాలి?
చాలా రోజులు సెలవుల తర్వాత పిల్లలు స్కూళ్లకు వెళ్తుండడంతో వారి లంచ్ బాక్సులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఏం పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, పేరెంట్స్ పక్కన లేకపోయినా గబాగబా తినాలంటే ఏం వండి పెట్టాలి, స్నాక్స్, లంచ్ వేర్వేరుగా ఎలా సిద్ధం చేయాలి తదితర విషయాల్లో పేరెంట్స్ తలమునకలవుతున్నారు. పిల్లల ఇష్టానికి గౌరవం ఇస్తూ.. వారి ఆసక్తికి అనుగుణంగా బాక్సు సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు.
సంతోషాలు పంచుకోండి
సెలవుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను విహార, విజ్ఞానయాత్రలకు తీసుకెళ్లారు. అక్కడ చిన్నారులు ఎన్నో విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించారు. పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో సెలవుల్లో విహార, విజ్ఞానయాత్రల్లో చూసిన అంశాలను స్నేహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. యాత్రలను ఎలా ఆస్వాదించారు, విజ్ఞానపరంగా ఏం నేర్చుకున్నారు, కొత్త ప్రదేశాల్లో గమనించిన అంశాలేమిటి తదితర అంశాల గురించి చర్చించుకోవాలని చెప్తున్నారు. చర్చల ద్వారా మరిన్ని కొత్త విషయాలు బయటకు రావడంతోపాటు ఎక్కువ కాలం ఆ అంశాలు గుర్తుంచుకునేందుకు అవకాశం ఉంటుందని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే ఉపాధ్యాయులతో ఇలాంటి అంశాల గురించి చర్చించడం ద్వారా మరెన్నో కొత్త, తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుందని చెప్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

