అందుబాటులోకి మై జీహెచ్ఎంసీ యాప్
గ్రేటర్‌వాసుల అవసరాలు తీర్చేందుకు సరికొత్త మార్పులతో ‘మై జీహెచ్ఎంసీ యాప్' అందుబాటులోకి వచ్చింది. శానిటేషన్, ఇంజినీరింగ్, హెల్త్, స్ట్రీట్ లైట్, రోడ్స్, డ్రెయిన్ క్లీనింగ్, రోడ్ స్వీపింగ్, తదితర సమస్యలపై ఫొటోగ్రాఫ్లతో పాటు జియో లొకేషన్ ద్వారా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి చేరుతున్నది. అంతేకాక ఈ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకోవడంతో పాటు ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేసుకోవచ్చు.
- సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కర్ణన్ సూచన
సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌వాసుల అవసరాలు తీర్చేందుకు సరికొత్త మార్పులతో ‘మై జీహెచ్ఎంసీ యాప్’ అందుబాటులోకి వచ్చింది. శానిటేషన్, ఇంజినీరింగ్, హెల్త్, స్ట్రీట్ లైట్, రోడ్స్, డ్రెయిన్ క్లీనింగ్, రోడ్ స్వీపింగ్, తదితర సమస్యలపై ఫొటోగ్రాఫ్లతో పాటు జియో లొకేషన్ ద్వారా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి చేరుతున్నది. అంతేకాక ఈ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకోవడంతో పాటు ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ టాక్స్, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగింపునకు వెహికిల్ బుకింగ్ లాంటి సర్వీస్‌లను సింగిల్ క్లిక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకునే అవకాశం సైతం ఉన్నది. వీటితో పాటుగా జీహెచ్ఎంసీ కార్యాలయాల లొకేషన్, వాతావరణ సూచనలు.. ఇలా అనేక సేవలు క్షణాల్లో పొందవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు.
మై జీహెచ్ఎంసీ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్లోని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు సేవలు పొందవచ్చని కమిషనర్ సూచించారు. లొకేట్ వార్డు ఆఫీస్ ఆప్షన్‌లోకి వెళ్తే జీహెచ్ఎంసీ ఆఫీసుల లొకేషన్ తెలుసుకోవచ్చన్నారు. ట్రేడ్, పెట్ డాగ్ లైసెన్స్‌ను ఫ్యూ క్లిక్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. నగర పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

