లాస్ట్‌మైల్ కనెక్టివిటీ..
ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నది.
- నైట్ లైఫ్‌కు అనుగుణంగా.. మెట్రో సేవలు
- ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు కార్యాచరణ
- వేళల పొడిగింపుతో ప్రయోజనం పొందేలా టైమ్ టేబుల్
సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నది. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల వరకు, ఆ తర్వాత తెల్లవారుజామున 3-4 గంటల నుంచే నగర వాసులు తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నగర వాసులకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉంచేందుకు ఉన్న అవకాశాలపై మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేపట్టారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆ తర్వాత మెట్రో రైలు ప్రధానంగా ఉన్నది. ప్రైవేటు రంగంలో ఆటోలు, క్యాబ్‌లు, ద్విచక్రవాహనాలను గణనీయంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా క్యాబ్ సేవలు అందించే సంస్థలు సైతం బాగా పెరిగాయి. అయితే ముఖ్యంగా రాత్రి పది గంటల నుంచి 12 గంటలు, ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య ప్రయాణికులకు ప్రజా రవాణా వ్యవస్థల కొరతను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఈనేపథ్యంలోనే మెట్రో కారిడార్లు విస్తరించి ఉన్న 3 మార్గాల్లో మెట్రో రైళ్ల వేళలను పొడిగించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న దానిపై ఇటీవలే మెట్రో అధికారులు ప్రయోగాత్మకంగా సోమ, శుక్రవారాల్లో మెట్రో వేళల పొడిగింపును ప్రకటించారు. ఈ సమయంలోనే మెట్రో ప్రయాణికుల పెరుగుదలను అధ్యయనం చేసి, మరింత సమయం పెంచేందుకు అవకాశం ఉన్నదని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.
బస్సు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా మెట్రో సర్వీసులు.
రోజు వారీ ప్రయాణికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని మెట్రో సేవలను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో ఉన్న ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి(హైదరాబాద్) రైల్వే స్టేషన్, బేగంపేట, మలక్‌పేట రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారి కోసం ఎలాంటి సమయాల్లో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంచాలన్న దానిపై మెట్రో అధికారులు అధ్యయనం చేశారు. ఇప్పటికే 69 కి.మీ మేర మూడు కారిడార్లలో బస్సు, రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లపైనా ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు
మెట్రో రైళ్లు ఏ సమయంలో..
రెండో దశ మెట్రో విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న మెట్రో కారిడార్లలో ప్రయాణికుల అవసరాలపై ప్రత్యేకంగా సర్వే చేశారు. ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని బస్సు, రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే వారికి మెట్రో రైళ్లు ఏ సమయంలో అందుబాటులో ఉంచాలన్న దానిపై అధికారులు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రాత్రి 11-12 గంటల మధ్య, ఉదయం 4-6 గంటల మధ్య ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. మెట్రో నినాదమైన లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇంటి నుంచి బయలు దేరింది.. మొదలు కొని చివరి గమ్య స్థానం చేరే వరకు మెట్రోను ప్రధాన ప్రయాణంగా మార్చుకునేలా.. మెట్రో వేళల పొడిగింపును ప్రయోగాత్మకంగా చేపట్టారు. కొత్త టైమ్ టేబుల్‌తో ఎక్కువ మంది ప్రయోజనం పొందేలా ఆయా ప్రాంతాలను, సమయాలను నిర్ణయించే పనిలో మెట్రో యంత్రాంగం నిమగ్నమై ఉన్నది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

