కాంగ్రెస్‌లో కొత్త వారికి పెత్తనమా..?
40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్‌మహారాజ్ హెచ్చరించారు.
- కార్యకర్తల సమావేశంలో పైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్
బషీరాబాద్, జూన్ 30 : 40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్‌మహారాజ్ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో జిల్లా పార్టీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో రమేశ్‌మహారాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి నాయకులే వచ్చారు ఓటర్లు రాలేదన్నారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని చూస్తే అర్థమవుతుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే తహసీల్దార్, ఎంపీడీవో, పార్టీ ఆఫీస్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డిఘణపూర్, గొట్టిగకలాన్ గ్రామాల్లో జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమావేశంలో గుర్తు చేశారు. పాత కార్యకర్తలకు జరుగుతున్న అవమానంపై మిస్తే చర్చించేందుకు వస్తా.. లేదా దరఖాస్తు ఇస్తానని ఎమ్మెల్యేను ఉద్దేశించి పేర్కొన్నారు. మీరు వచ్చి రెండేండ్లు అవుతున్నది.. మేము గత 40 ఏండ్లుగా పార్టీలో ఉన్నామన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యాక్షులు వినోద్‌రెడ్డి, అధికార ప్రతినిధి నరేందర్, మండల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

