హలీం..ఆరగిద్దాం..
రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తొచ్చేది హలీం. దీంతో నగరంలో హలీం సందడి షురూ అయ్యింది. ప్రతి గల్లీలోనూ హలీం సెంటర్లు వెలుస్తున్నాయి.
- వెలిసిన హలీం సెంటర్లు
సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తొచ్చేది హలీం. దీంతో నగరంలో హలీం సందడి షురూ అయ్యింది. ప్రతి గల్లీలోనూ హలీం సెంటర్లు వెలుస్తున్నాయి. ముస్లింలకు ఇఫ్తార్ విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీం.. మతాలకతీతంగా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్నాక్‌గా మారింది. ఈ వంటకాన్నీ అరేబియన్స్ పరిచయం చేశారు. దీనిని హరీస్ అని కూడా పిలుస్తారు.
పదో శతాబ్దంలో కితాబ్ అల్ తబిక్ (వంటల పుస్తకం)లో తొలిసారిగా ఈ విషయాని రాశారు. హైదరాబాద్ నిజాం ఆర్మా దగ్గర ఉండే అరేబియన్ సైన్యం హలీంను మన దేశంలోకి తీసుకొచ్చింది. హలీంను చికెన్, మటన్‌తో తయారు చేస్తారు. సుమారు 6 నుంచి 8 గంటల వరకు హలీం తయారీకి సమయం పడుతుంది. ప్రతి వంద గ్రాముల హలీంలో 157 క్యాలరీలు, 9.7 గ్రాముల ప్రొటీన్, 6.86గ్రాముల కొవ్వు పదార్థం, 15.2 గ్రాముల పిండిపదార్థాలుంటాయని తెలిపారు. హలీం రుచి కోసం ఇతర రాష్ర్టాల వారు సైతం హైదరాబాద్‌కు తరలొస్తుండటం విశేషం.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

