మత్తును చిత్తు చేద్దాం
మత్తును చిత్తు చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు.
- వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్, జూలై 23 : మత్తును చిత్తు చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలో 31 గంజాయి కేసుల్లో 104 కేజీల 530 గ్రాములు గంజాయిని పట్టుకొని సీజ్ చేసిన తర్వాత వికారాబాద్ కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామంలోని మెడికర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో కాల్చి వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవ్వరూ గంజాయి, ఇతర మత్తుకు అలవాటు పడవద్దన్నారు. ముఖ్యంగా యువకులు చెడు వ్యసనాలకు లోనుకాకుండా మంచి మార్గంలో నడువాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని, గంజాయి వంటి మత్తు పదార్థాలు ముందుగా ఆనందాన్ని కలిగించినా.. చివరకు జీవితంలో విషాదాన్ని మిగిలిస్తాయన్నారు.
జిల్లావాసులు గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లపై దృష్టి సారించి మత్తు పదార్థాలు ఇతర చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, వ్యాపారం, సేవించే వారిపై దృష్టి పెట్టామని వివరించారు. ఎవరైనా మత్తు పదార్థాలను ప్రోత్సహించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరికైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ అధికారులకు అందించాలని, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు డీఎస్పీలు అధికారులు, సీఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

