హెచ్ఎండీఏలో నెలాఖరు వరకే డీపీఎంఎస్
భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల కోసం హెచ్ఎండీఏ పరిధిలో సింగిల్ విండో విధానాన్ని మాత్రమే అమలు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం 2016 నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను ప్రారంభించగా, దాని స్థానంలో కొత్తగా టీ ఎస్ బీపాస్ విధానాన్ని తీసుకొచ్చారు.
- 1 నుంచి టీఎస్ బీపాస్తోనే భవన నిర్మాణ అనుమతులు
సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల కోసం హెచ్ఎండీఏ పరిధిలో సింగిల్ విండో విధానాన్ని మాత్రమే అమలు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం 2016 నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను ప్రారంభించగా, దాని స్థానంలో కొత్తగా టీ ఎస్ బీపాస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రెండు విధానాల్లో అనుమతులకు అవకాశం ఉన్నది.
జూలై 1 నుంచి కేవలం టీఎస్ బీపాస్ ద్వారానే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాల్లో విస్తరించి ఉన్నది. ఇందులో జీహెచ్ఎంసీతో పాటు 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు, 697 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతులు డీపీఎంఎస్ ద్వారా ఇస్తుండగా, ఇక నుంచి హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికనుగుణంగానే వెబ్సైట్ మార్పులు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

