కొండాపూర్, అక్టోబర్ 1 : లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పట్టుబడిన వారు ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్, రషీద్ లుగా గుర్తించారు.
కాగా , వీరు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తెలిసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.