పీవీ శతజయంతి నేడే
- పీవీ మార్గ్‌లో మాజీ ప్రధాని విగ్రహం ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- ఏర్పాట్లు పూర్తిచేసిన హెచ్ఎండీఏ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకొని హుస్సేన్‌సాగర్ సమీపంలో నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించనున్నారు. నెక్లెస్ రోడ్డును ఇప్పటికే పీవీ మార్గ్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఏడాదికాలంగా పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్ 28 పీవీ జయంతి. విగ్రహావిష్కరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం విగ్రహం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్, కార్యదర్శి సంతోష్, డీసీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహం చుట్టూ వివిధ రకాల అభివృద్ధి పనులు, పచ్చదనం, ఫెన్సింగ్ వంటివి ఇప్పటికే పూర్తి చేశారు. 15 రోజులుగా హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగంతోపాటు సాంస్కృతిక శాఖ ఉన్నతాధి కారులు విగ్రహం ఏర్పాటు పనులను పర్యవేక్షించారు.
Read Today's Latest Pvnr-hundred-years News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

