త్రిషకు ఘోర అవమానం.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ త్రిష. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పటికే 50 సినిమాలకు పైగా నటించిన త్రిష.. ఇప్పటికీ బిజీగానే ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది త్రిష. ఇలాంటి ఒక అద్భుతమైన హీరోయిన్‌కు ఇప్పుడు ఒక దారుణమైన అవమానం ఎదురైందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అంతగా ఏం జరిగింది అనుకుంటున్నారా..?

తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళంలో త్రిషకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టే అభిమానులు ఉన్నారు. దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుంటారు. మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 96 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ తమిళనాట చరిత్ర సృష్టించింది. అంతేకాదు 96 సినిమాలో త్రిష నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అవార్డులను కూడా గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమా తర్వాత త్రిషకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. మళ్లీ వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె చేసిన సినిమా ‘పరమపథం విలయాట్టు’. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది త్రిష. ఏడాది కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే కరోనా వైరస్ కారణంగా విడుదల కాలేదు. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి ఈ సినిమాను నిర్మాతలు విడుదల చేస్తారని అనుకుంటున్న తరుణంలో OTTకి ఇచ్చేశారు. దాంతో ఈమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.

ఒక్క ముక్క కూడా చెప్పకుండా నేరుగా ఓటీటీ రిలీజ్ చేస్తుండటంతో త్రిష బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఈమెకు ఇంతకంటే అవమానం లేదు అంటూ అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఇందులో అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉందని.. థియేటర్లో విడుదల అయితే తన కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుందని త్రిష భావించింది. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Trisha
- Trisha krishnan
- త్రిష
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

