కుక్కిన పేనులా పడుండాలె!
‘నువ్ ఈ ఇంట్ల ఉన్నంత కాలం మేం జెప్పినట్లె చెయ్యాలె. ఎన్నిమాటలన్నా.. కొట్టినా, తిట్టినా కుక్కిన పేనులా ఇంట్ల పడుండాలె. కాదని ఎదురు తిరిగితే.. కాట్లో కలిసిపోతవ్' అనే వార్నింగ్‌లు చిన్నప్పుడు బాగా వినిపించేవి. కొత్త కోడల్ని సాధించుకోవడానికో..
‘నువ్ ఈ ఇంట్ల ఉన్నంత కాలం మేం జెప్పినట్లె చెయ్యాలె. ఎన్నిమాటలన్నా.. కొట్టినా, తిట్టినా కుక్కిన పేనులా ఇంట్ల పడుండాలె. కాదని ఎదురు తిరిగితే.. కాట్లో కలిసిపోతవ్’ అనే వార్నింగ్‌లు చిన్నప్పుడు బాగా వినిపించేవి. కొత్త కోడల్ని సాధించుకోవడానికో.. అమాయకులపై పెత్తనం చెలాయించడానికో.. ఇట్లాంటి పదాలు ఉపయోగించి చెప్పుచేతల్లో ఉంచుకునేవారు. ఈ పదబంధంలో ‘కుక్కిన పేను’ గురించి తెలుసుకుందాం. తలలో ఉన్నప్పుడు పేనుదే రాజ్యం. పట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. దొరికినట్లే దొరికి అంతలోనే మాయమైపోతుంది. ఒక్కసారి దొరికిన తర్వాత.. తీసి కుక్కితే ఇక కదలదు. ఉన్నచోటనే చచ్చి పడుంటుంది. అమాయకులను మెల్లిగా తమ దారిలోకి తెచ్చుకొని.. వారిపైనే పెత్తనం చెలాయిస్తుంటారు కొందరు. అలాంటివారిలో మాయలో పడితే.. కుక్కిన పేనులా అలా పడి ఉండటమే. చేసేది ఏమీ ఉండదు. తై అంటే.. తై అనాలె.. లేకుంటే ఊకుండాలె.
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

