గార్వం = గారాబం (అరెయ్.. చెప్పిన మాట విను. ఎక్కువ చెయ్యకు. పట్టిందే కావాలని గార్వం చెయ్యకు. గార్వం గంజికేడిస్తే.. ఈపు దెబ్బలకు ఏడ్చిందట.. ఈపు సాపైతది బిడ్డా)
సిట్కున = తొందరగ, జల్ది, టక్కున, క్షణంలో, జప్పున, చిటెకలో. .. (మల్లిగానికి నువ్ ఏ పని అప్పజెప్పినా సిట్కున జేస్తడు. వానికన్నీ తాత పోలికలే అచ్చినయ్..)
తిమ్మితం = నిమ్మలం, స్థిమితం (ఇగో.. మనసుల రందిబడ్డప్పుడే తిమ్మితంగ ఉండాలె.
లేకపోతే పెయ్యంత గాయిగాయి అయితది. దిమాక్ ఖరాబైతది)
కైలాట్కం = ఉత్తగనే కొట్లాడటం (ఎహె తియ్.. గాళ్లెప్పుడూ అంతే.. చీటికిమాటికి కైలాట్కం జేస్తరు. దేనికీ ఓ రీతుండదు..
రివాజుండదు..)
ఎడ్డిమాలోకం = తెలివి తక్వతనం, బుద్ధిలేనోడు (వీడొట్టి ఎడ్డిమాలోకం. ఏ పనిజేసినా.. నలుగురితో తిట్టిపిచ్చుకునుడె. ఎప్పుడు మారతడో ఏందో..)