UNICEF | పిల్లల రేపటి కోసం మన నేటి త్యాగం.. నేడు యునిసెఫ్ దినోత్సవం
‘మన పిల్లల రేపటి కోసం, నేటిని త్యాగం చేద్దాం’ అనే నినాదంతో ఏటా యూనిసెఫ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్.
UNICEF | ‘మన పిల్లల రేపటి కోసం, నేటిని త్యాగం చేద్దాం’ అనే నినాదంతో ఏటా యూనిసెఫ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. పేరు సూచించినట్టుగా, ఈ సంస్థ ప్రపంచానికి, ప్రత్యేకంగా పిల్లలకు సహాయం చేయడానికి అవసరమైన నిధులను సేకరిస్తుంది. ఈ ఏడాది ‘ప్రతి బిడ్డ కోసం- ప్రతి హక్కు’ అనే థీమ్‌తో యూనిసెఫ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ప్రపంచంలోని అణగారిన వర్గాల పిల్లల స్థితిగతులను ఉద్ధరించడానికి యూనిసెఫ్ అసోసియేట్లు నడుం బిగించిన డిసెంబర్ 11ను ఏటా యూనిసెఫ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి .. బాలల సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ యూనిసెఫ్. బాలల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ఈ సంస్థ కృషి చేస్తున్నది. పిల్లలకు టీకా మందులు , పోషకాహార అవసరాన్ని తెలియజే స్తూ, తమ బాల్యం ఆనందంతో గడుపుతూ ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో పనిచేసే సంస్థ యూనిసెఫ్.
యుద్ధంలో ఓటమి చవిచూసిన దేశాల్లోని పిల్లలకు మద్దతుగా, వారికి ఊరటను అందించడంలో సహకరించేందుకు గాను రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ .. ‘యునైటెడ్ నేష న్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్‌ను (యునిసెఫ్)’ను ఏర్పాటుచేసింది. 1940ల నాటి ఆహార , వైద్య సంక్షోభం ముగిసిన తర్వాత సంక్షుభిత దేశాల్లోని పిల్లల సహాయ సంస్థగా యూనిసెఫ్ తన పాత్రను కొనసాగించింది. 1970వ దశకంలో పిల్లల హక్కుల పరిరక్షణ సంస్థగా రూపుదిద్దుకున్నది.
1980లో పిల్లల హక్కుల ముసాయిదా తయారీలో యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌కు సహకరించింది. 1989 యూఎన్ జనరల్ అసెంబ్లీకి పరిచయం తర్వాత పిల్లల హక్కుల కన్వెన్షన్ అత్యం త విస్తృతమైన మానవ హక్కుల ఒప్పందంగా చరిత్రలో నిలిచిపోగా, ఈ ప్రయత్నంలో యునిసెఫ్ కీలక పాత్ర పోషించింది. 183 ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల్లో కేవలం సోమాలియా, అమెరికా దేశాలు మాత్రమే ఒప్పందం అమల్లో విఫలమయ్యాయి. సోమాలియాకు అంతర్జాతీయ గుర్తింపు గల ప్రభుత్వం లేకపోవడంతో ఒప్పంద అమలు అక్కడ ఎంతమాత్రం సాధ్యపడలేదు. యూనిసెఫ్ను 1946 డిసెంబరు 11న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏర్పాటుచేశారు. జాతి, మత,రాజకీయ వివక్షలేవీ లేకుండా అవసరాలే ఆధారంగా పిల్లలకు సహాయపడాలన్నది యూనిసెఫ్ లక్ష్యము .
మొదట్లో ఇది తాత్కాలికమైన ఎమర్జెన్సీ సంస్థ గానే ఉండేది. 1947 నుంచి 1950 వరకు రెండో ప్రపంచ యుద్ధకాలంలో దెబ్బతిన్న పిల్లలకు సహాయం అందించడమే తన ధ్యేయంగా పనిచేసింది. యూనిసెఫ్ 31. 90 కోట్ల టన్నుల పాలు, దుస్తులు, స్కూలు అవసరాలను యూరప్, చైనాల్లోని పిల్లలకు అందించింది. క్షయ వ్యాధికి ‘రెడ్‌క్రాస్’ సహకారంతో టీకాలు వేయించింది. యూరోపియన్ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత కూడా చేయాల్సిన పని చాలా మిగిలిపోయింది. దీంతో ఆఫ్రికా, మధ్యప్రాచ్యం , దక్షిణ అమెరికాల్లోని వర్ధమాన దేశాల్లో యూనిసెఫ్ పని ప్రారంభించింది. 1953లో సుదీర్ఘ చర్చల అనంతరం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యూనిసెఫ్ శాశ్వత మనుగడకు ఓటువేసింది. దాని పేరునుంచి అంతర్జాతీయ, ఎమర్జెన్సీ అన్న పదా లను పూర్తిగా తొలగించింది. కానీ యూనిసెఫ్ అన్నది అలా నిలిచిపోయింది. యూనిసెఫ్ 150 దేశాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పనిచేస్తున్నది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్యక్రమాల నిర్వహణకుగాను సంపన్న దేశాల్లోని 36 జాతీయ కమిటీల ద్వారా నిధులను సేకరించే కార్యక్రమాన్ని, పిల్లల హక్కులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ నిరంతరం కృషిచేస్తున్నది.
సీవీవీ ప్రసాద్
80196 08475
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

