జీవ భాష
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఎంత తీయనిదమ్మ మన మాతృ భాష
ఎంత చక్కనిదమ్మ మన తెలుగు భాష
పాలధారల కన్నా మిన్నైన భాష
పొగడపూల కన్నా సొగసైన భాష
అమ్మ ఒడిలోన ఓనమాలు దిద్ది
ఉంగ ఉంగాంటూ ఊసులాడే భాష
పసిపాప నగవుల్లో వెన్నెలలు కురిపించు
గోరుముద్దలలోన మురిపాలు నింపు
తేనెలూరేను తేట తెలుగులోనే
నీటి తేట ఊటై పొంగి పొర్లేను
ఉయ్యాల తొట్టిలో ఓలలాడిన భాష
జోల పాటల్లో పల్లవించిన తెలుగు
ముత్యమై మెరిసేటి ముద్దులొలుకు భాష
అందమైన తెలుగు మన అమ్మ భాష
రమణీయ శ్రవణంతో కమనీయ వచనం
సొగసైన రాగంతో ఎద పలికే గానం
మధుర లిఖితమౌ మన భాష తెలుగు
తలపులోన మెదిలి కవితలెన్నో కూర్చు
పెరటిలో విరిసిన ముద్దబంతుల తీరు
బంగారు వర్ణమై రంగులీను భాష
సంగీత స్వరధనులు శబ్దించు నా భాష
ఆట పాటల్లోన అలలారే తెలుగు
అమ్మ ప్రేమలోని కమ్మదనమంతా
మన భాషకు గాక మరిదేనికుంది
పలుకు పలుకులోన మమతలద్దిన భాష
మమకార మాధుర్యం పండించు తెలుగు
భావ సంద్రమై బాసించు భాష
పలకరింపులతోనే మనసులెన్నో గెలుచు
పరభాషల వెంట పరుగుబెట్టుటయేల
మన భాష మనుగడకు అడుగిడు బాల
దేశభాషలందు తెలుగు లెస్స భళా
ఏ భాషకు లేని ఘనకీర్తి గల తెలుగు
నెల్లుట్ల సునీత
79894 60657
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

