మరో పోరుకు నాంది పలుకుదాం
సమైక్య రాష్ట్రంలో జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రానికి వెళ్లి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రజలకు పెనుభారంగా ఉండేది. తమ ఉద్యోగ కాలంలో మొత్తం జిల్లాలో ఉన్న గ్రామాలను కలెక్టర్ పర్యటించే అవకాశం లేకుండా పోయింది.
దీంతో అభివృద్ధి, సంక్షేమం పర్యవేక్షణలో ఇబ్బందులు ఏర్పడేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో ప్రజల ముంగిట పాలన ఉండాలని నిర్ణయం తీసుకుని పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా రూ.3.50 కోట్ల, పరిపాలనా సౌలభ్యంతోపాటు, అభివృద్ధి, సంక్షేమం, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేయడం పరిపాలనా విప్లవం.
తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచడం ద్వారా అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యా సంస్థలు, ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు వీలవుతుంది. ప్రజల ముంగిట పాలన ఉంటే పారదర్శక పరిపాలన సాధ్యమవుతుందని విశ్వసించి కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. జిల్లాల ఏర్పాటు తర్వాత తీసుకున్న మరో గొప్ప నిర్ణయం జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు జోన్లను ఏడు జోన్లుగా, 2 మల్టీజోన్లుగా విభజించి గతంలో ఉన్న రిజర్వేషన్ పద్ధతిని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చారు.
దేశంలోనే తొలిసారిగా స్థానిక రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న 85%, 70%, శాతం రిజర్వేషన్లు 95% శాతం తెలంగాణ ప్రజలకు దక్కేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆమోదం తీసుకురావడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. జిల్లా స్థాయి పోస్టుల్లో జిల్లా యువకులకు దక్కే అవకాశం వచ్చింది. గ్రూప్-1 ఉద్యోగాలు కూడా స్థానికులకు దక్కే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్, మండలాలు ఏర్పాటు వలన ప్రజలకు పరిపాలన అందుబాటులోకి రావడం రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమైంది. కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. పరిపాలన సంస్కరణలు తెలంగాణ సత్వర అభివృద్ధికి గొప్ప చోదకశక్తిగా మారాయి.
‘సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది. 2014లో తలసరి ఆదాయం రూ.1,24,104 నుంచి రూ.3,17,115 లకు పెరిగింది. రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.5,05,848 నుంచి రూ.12,93,469 కోట్లకు పెరుగడం పరిపాలనా సంస్కరణల ఫలితం. విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి జూన్ 23 వరకు 19,464 మెగావాట్లకు పెరిగింది.
తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2,140 యూనిట్లకు పెరిగింది. నిరంతర విద్యుత్తు కోసం రూ.1,37,517 కోట్లు ఖర్చు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాకతీయ మిషన్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.68 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 350 లక్షల టన్నులకు పెరిగింది.
విద్యారంగంలో 1,022 గురుకులాల ఏర్పాటు, 1,005 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 85 గురుకుల డిగ్రీ కాలేజీలు, 29 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. ఎంబీబీఎస్ సీట్లు మూడు రెట్లు పెరిగాయి. వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించి బెడ్స్ 17 వేల నుంచి 34 వేలకు, ఐసీయూ 5 నుంచి 80, బస్తీ దవాఖానాలు 500, డయాలసిస్ కేంద్రాలు 3 నుంచి 82 వరకు పెంపుతోపాటు హైదరాబాద్ నలువైపులా టిమ్స్ నిర్మాణం, నిమ్స్ విస్తరణ, లాంటి చర్యల వలన ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధితో పాటు సంక్షేమం జోడెద్దుల లాగా పాలన సాగింది. అన్నిరంగాల్లో తెలంగాణ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులు ఎక్కువగా దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలువడం గర్వకారణం.
ప్రజల సంక్షేమం, పరిపాలన రాష్ట్ర ప్రగతికి మాత్రమే కాదు.. దేశాభివృద్ధిలో భాగంగా భావించి పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రజలకు ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. జిల్లా స్థాయి కార్యాలయాలు ప్రజలకు చేరువయ్యాయి. సమస్యలకు సులభంగా పరిష్కారాలు కనుగొనేందుకు వీలుకలిగింది. నగరాలు అభివృద్ధి చెందాయి.
శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తమ సర్వీస్ సమస్యల కోసం నిత్యం డీఈవో, కలెక్టర్లను కలిసే అవకాశం రావడం, చిన్నతరహా ఉద్యోగులకు స్వంత జిల్లాలో పనిచేసే అవకాశం కలిగింది. జిల్లా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతమై పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించింది. జిల్లాల ఏర్పాటు సత్వర అభివృద్ధికి, పారదర్శక పాలనకు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావడం పరిపాలనా సౌలభ్యమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు. భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ జనం హర్షిస్తున్నారు. జిల్లాలు ఏర్పాటు జరిగి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చారిత్రక నిర్ణయాన్ని హర్షిస్తూ అన్ని జిల్లాల్లో నేడు, రేపు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపడంతోపాటు, నాటి వికాసాన్ని ప్రజలకు వివరించాలి. స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికి సారథ్యం వహించి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుందాం. దాదాపు మూడేండ్ల కాంగ్రెస్ దుష్టపాలనను ఎండగట్టి, బీఆర్ఎస్ అండగా ఉంటుందనే ప్రజలకు భరోసా ఇద్దాం.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడుదాం.
(వ్యాసకర్త: రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
దేవీప్రసాద్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

