సూడు సూడూ నల్లగొండా..గుండెమీదా ఫ్లోరైడు బండా..(2003లో కేసీఆర్ రాసిన పాట)
సూడు సూడూ నల్లగొండా గుండెమీదా ఫ్లోరైడు బండా బొక్కలొంకర బోయిన బతుకులా..నల్లగొండా జిల్లా దుఃఖమెల్లా దీసేదెన్నాళ్లో..నల్లగొండా జిల్లా...
సూడు సూడూ నల్లగొండా
గుండెమీదా ఫ్లోరైడు బండా
బొక్కలొంకర బోయిన
బతుకులా..నల్లగొండా జిల్లా
దుఃఖమెల్లా దీసేదెన్నాళ్లో..నల్లగొండా జిల్లా…
కడుపులల్లా నలుసూ మీదా
కమ్ముకున్నది విషపూ నీడ
కన్నతల్లీ పాలల్లగూడ
తొంగిచూసెను ఫ్లోరైడ్ జాడ
పాడిపంటలల్లా గూడా
పొంగిపొర్లే ఫ్లోరైడు పీడా
భూతమోలే దాపురించిందో..ఈ ఫ్లోరైడు పీడా
చావు బతుకుల సందెలు చూపింది ఈ ఫ్లోరైడు పీడా…
పరచుకున్నా పచ్చటిదారల
పులిసిపోయీ పుచ్చిన పండ్లు
కట్టెసరిచిన కాళ్లూచేతులూ
వంకర వంకరలు దిరిగే
పాలవయస్సూ పసిడిపిల్లల్లూ..
మా పల్లెల్లా..పండుముసలీ తాతలైతుండ్రు
మా తండాలల్లా పండు ముసలీ తాతలైతుండ్రు
వంక జాబిలి చూద్దామంటే
వంగిపోయినా మెడలూ లెవ్వయి
కోతికొమ్మాటలాడాలంటే
కుంగిపోయినా కాళ్లూ కదలయి
బొక్కలల్లా మూలుగ సచ్చిందో…మా సక్కని చుక్కలు
బిక్కు బిక్కున దిక్కులు చూశారో..ఓ సందామామలు…
కూలీ చేయకుంటే మాకు
కుండలోకి ఎసరే ఉండదు
వంకరయ్యిన బిడ్డాలాను
వదిలిపెట్టి ఉండాలేము
పసుల కొట్టాలల్లా కట్టేసీ..పసిపిల్లలను
పసులోలే తల్లాడిల్లేమూ..వాల్ల గోసలు చూసి
గుండెలవిసీ ఏడుస్తు ఉన్నామూ
సాగరున్నా సాగది మనది
దూప దీరదు దుఃఖామొడవదీ
నవుసుతున్నా నల్లాగొండకు
ఎడమ కాల్వ ఎత్తీపోయ్యది
ఆంధ్రాసోపతి ఆపతికొచ్చిందో..నల్లగొండా బిడ్డలు
బోరు నీళ్లతో బొందకు అయిందో నల్లగొండా బిడ్డలు
మూసీ నదిలో మురికీ నింపి
పోతిరెడ్డి పొక్కను పెంచి
నల్లగొండను నట్టేట ముంచి
పులిచింతకు పురుడూపోసి
కృష్ణనీళ్లను మలుపుక పోతుంటే…
ఈ ఆంధ్రాపాలన
కీళ్ల నొప్పులతో కుములుతున్నారో
మన జిల్లా బిడ్డలు
ఎండిపోయినా బొక్కల మీదా
ఎగురుతున్నవి జెండాలెన్నో
నల్లగొండకు నరకం చూపిన
రాజకీయా గండాలెన్నో చల్…!
పాతరబెట్టీ పోయ్యిలా బెట్టాలె
ఈ పరాయి జెండాల
నడిమికిరిసి నేలకు గొట్టాలె
ఈ పాపిష్టి జెండాల
తెలంగాణ తొవ్వా బట్టాలే ..
మన నల్లగొండా
జబ్బ చరిచీ జంగూకురకాలె
మన నల్లగొండా
నీటి మీదా హక్కును
గెలవాలె మన నల్లగొండా
స్వచ్ఛమైనా నీళ్లూ తాగాలే
మన నల్లగొండా
సొంత రాష్ట్రం సాధించుకోవాలె.. తెలంగాణ బిడ్డా
వాజ్‌పేయి హయాం ముగిసే తరుణంలో ఫ్లోరోసిస్‌పై కేసీఆర్ 2003లో కట్టిన పాట ఇది. వాజ్పేయే ఈ సమస్యను పరిష్కరించి ఉంటే ఈ పాట ఎందుకు పుట్టేది?
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Edit Page News
- song
- Vajpayee
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

