స్టెప్ బ్రదర్ తో డేటింగ్ కు యువతి రెడీ

న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలు, డేటింగ్ యాప్ లతో యువతీ యువకుల్లో విపరీత పోకడలు నెలకొంటున్నాయి. సవతి సోదరుడితో డేటింగ్ కు సిద్దమని, అతడిపై తాను ప్రేమ పెంచుకున్నానని ఓ మహిళ డేటింగ్ షో సీక్రెట్ క్రష్ లో వెల్లడించడం స్టెప్ బ్రదర్ కల్లమ్ లో కల్లోలం రేపింది. డేట్ కు వెళ్లేముందు ఇష్టమైన వారి పట్ల భాగస్వాములు తమ ప్రేమను ఈ షో ముందు బహిర్గతం చేస్తుంటారు. ఇక స్టెప్ బ్రదర్ కల్లమ్ తో క్రష్ పై మాడీ పలు విషయాలు వెల్లడించారు. తన తల్లి గతంలో కల్లమ్ తండ్రితో చాలా కాలం కలిసి ఉన్నారని దీంతో బాల్యం నుంచే కల్లమ్ తో పరిచయం ఉందని ఆపై తమ తల్లి కల్లమ్ తండ్రితో విడిపోవడంతో చాలా ఏండ్లుగా తాము దూరమయ్యాయని మాడీ చెప్పుకొచ్చింది.

చాలా రోజుల తర్వాత కల్లమ్ తో సోషల్ మీడియా వేదికగా తిరిగి పరిచయం కావడంతో అతడి పట్ల తాను ప్రేమ పెంచుకున్నానని తెలిపింది. చిన్నప్పుడు తాను చూసిన కల్లమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయి బాగా పరిణితి చెందాడని అతడితో డేటింగ్ కు తహతహలాడుతున్నానని వెల్లడించింది. మరోవైపు మాడీ తన పట్ల ప్రేమ కనబరచడంతో కల్లమ్ ఉద్వేగభరితమయ్యాడు. తనను బాగా చూసుకుంటే ఆమెతో ముందుకు నడిచేందుకు అభ్యంతరం లేదని చెబుతున్నాడు. తమ తల్లితండ్రులు విడిపోయిన ఇన్నేళ్ల తర్వాత ఆమె మనసులో తానుండటం అనిర్వచనీయ అనుభూతిని అందిస్తోందని మురిసిపోయాడు. తన తండ్రి మాడీ తల్లిని పెండ్లి చేసుకోనందున తమ ప్రేమకు ఈ వరసలు అడ్డు కావని చెబుతున్నాడు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- dating
- love
- step brother
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

