Cloth Mask | ఇంకా క్లాత్ మాస్క్ ధరిస్తున్నారా? అది ఎంత డేంజరో.. దాని వల్ల ఏమౌతుందో తెలుసుకోండి
Cloth Mask | అంతగా అవగాహన లేనప్పుడు చాలామంది క్లాత్‌తో తయారు చేసిన మాస్క్‌లను పెట్టుకునేవాళ్లు. కొందరైతే కర్చీఫ్నే మాస్క్‌గా పెట్టుకునేవారు. కానీ.. ఇప్పుడు కరోనా పలు రూపాలు మార్చుకుంది
Cloth Mask | చాలామంది కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు క్లాత్ మాస్క్‌లను ధరిస్తుంటారు. మాస్క్లలోనూ చాలా రకాలు ఉంటాయి. క్లాత్ మాస్క్‌లతో పాటు ఎన్95, సర్జికల్ మాస్క్‌లు కూడా ధరించవచ్చు. కోవిడ్ ప్రారంభంలో అంటే ఫస్ట్ వేవ్ సమయంలో అప్పటికి మాస్క్‌ల గురించి జనాలకు అంతగా అవగాహన లేనప్పుడు చాలామంది క్లాత్‌తో తయారు చేసిన మాస్క్‌లను పెట్టుకునేవాళ్లు. కొందరైతే కర్చీఫ్నే మాస్క్‌గా పెట్టుకునేవారు. కానీ.. ఇప్పుడు కరోనా పలు రూపాలు మార్చుకుంది. అప్పటికంటే బలంగా తయారైంది. మాస్క్‌ల వాడకం కూడా పెరిగింది. అయినప్పటికీ ఏ మాస్క్ పెట్టుకోవాలి.. ఏ మాస్క్ కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేస్తుంది అనేదానిపై చాలామందికి స్పష్టత లేదు.

అసలే కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో మళ్లీ మాస్క్‌ల గురించి చర్చ మొదలైంది. దీనిపై రీసెర్చ్ చేయగా.. ఓ స్టడీ ఏం చెబుతోందంటే.. క్లాత్ మాస్క్ వాడితే కరోనా వైరస్ రావడానికి 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుందట.
ఎన్95 మాస్క్‌లు మాత్రమే కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయగలవట. కరోనా వచ్చిన వ్యక్తి.. ఏ మాస్క్ ధరించకుండా ఉంటే.. వేరే వ్యక్తికి తారసపడి కనీసం 6 అడుగుల దూరంలో ఉన్నా కూడా 15 నిమిషాల్లో వేరే వ్యక్తికి కరోనా సోకే ప్రమాదం ఉంటుందట.
ఒకవేళ క్లాత్ మాస్క్ ధరిస్తే.. 27 నిమిషాల్లో కరోనా సోకే ప్రమాదం ఉందట. కరోనా వచ్చిన వ్యక్తి మాస్క్ వేసుకోకుండా ఉండి.. కరోనా రాని వ్యక్తి క్లాత్ మాస్క్ ధరించి ఇద్దరూ కలిసినా కూడా 20 నిమిషాల్లో క్లాత్ మాస్క్ ధరించిన వ్యక్తికి కరోనా సోకే ప్రమాదం ఉంటుందట. అదే సర్జికల్ మాస్క్ ధరించిన వ్యక్తి.. మాస్క్ లేని కరోనా వచ్చిన వ్యక్తిని కలిస్తే.. 30 నిమిషాల్లో కరోనా సోకుతుందట. ఒకవేళ.. కరోనా సోకిన, సోకని ఇద్దరు వ్యక్తులు ఎన్95 మాస్క్‌లు ధరిస్తే 25 గంటల్లో సోకని వ్యక్తికి వచ్చే ప్రమాదం ఉంటుంది.
Centres for Disease Control and Prevention (CDC) ఈ స్టడీని నిర్వహించింది. American Conference of Governmental Industrial Hygienists (ACGIH) ప్రకారం.. సర్జికల్ మాస్క్‌లు కరోనా బారి నుంచి కాపాడుకునేందుకు ఎక్కువగా తోడ్పడతాయని.. కరోనా వచ్చిన వాళ్లు ఈ మాస్క్‌లను ధరిస్తే చాలామటుకు తమ నుంచి ఇంకొకరికి సోకకుండా కాపాడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఒకవేళ క్లాత్ మాస్క్‌లనే ధరించాలనుకునేవారు.. సర్జికల్ మాస్క్‌తో పాటు దాన్ని కూడా ధరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్లాత్ షీల్డ్ ద్వారా కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందుతుంది. క్లాత్ దాని వ్యాప్తిని ఆపలేదు. అందుకే.. క్లాత్ మాస్క్‌ల కంటే సర్జికల్ లేదా ఎన్95 మాస్క్‌లను వాడాలని సైంటిస్టులు చెబుతున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

