2021లో బాబు, 2022లో పాప.. నిమిషాల గ్యాప్‌లో పుట్టిన కవలలు

వాషింగ్టన్: ఒక మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వారిద్దరూ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. 15 నిమిషాల వ్యవధిలో 2021లో బాబు, 2022లో పాప జన్మించారు. అరుదైన ఈ వింత ఘటన అమెరికాలో జరిగింది. కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమా మాడ్రిగల్ నిండు గర్భిణీ. నేటివిడాడ్ వైద్య కేంద్రంలో చేరిన ఆమెకు డిసెంబర్ 31న రాత్రి వేళ పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.45 గంటలకు బాబు ఆల్ఫ్రెడోకు జన్మనిచ్చింది. అనంతరం గడియారం ముల్లు 12కు చేరగా పాప ఐలిన్కు ఆమె జన్మనిచ్చింది. దీంతో ఈ కవలలు 15 నిమిషాల వ్యవధిలో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టినట్లయ్యింది.
కాగా, కవలలైన తన పిల్లలు కొన్ని నిమిషాల గ్యాప్‌లో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టడంపై తాను ఆశ్చర్యపోయినట్లు తల్లి ఫాతిమా మాడ్రిగల్ తెలిపారు. ఇది తనకు చాలా సంతోషం కలిగించిందని మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈ కవల పిల్లల ఫొటోను ఆ ఆసుపత్రి షేర్ చేసింది. ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది తేడాతో ఇలా వేర్వేరుగా ఈ ఇద్దరు పుట్టడం చాలా అరుదని, ‘రెండు మిలియన్లలో ఒక ఛాన్స్’ అని వెల్లడించింది.
తన కెరీర్లో అత్యంత అరుదైన ప్రసవాలలో ఇది ఒకటని ఆ మహిళ కుటుంబ వైద్యురాలు డాక్టర్ అనా అబ్రిల్ అరియాస్ తెలిపారు. ఫాతిమా మాడ్రిగల్, రాబర్ట్ ట్రుజిల్లో కుటుంబంలో మరో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా, ఒక అబ్బాయని అన్నారు.
మరోవైపు 2019 డిసెంబర్ 31న కూడా ఇలాంటి అరుదైన ప్రసవం జరిగింది. ఇండియానాలోని కార్మెల్లో అసెన్షన్ సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో కవలలు జన్మించారు. 2019 డిసెంబర్ 31 రాత్రి 11:37 గంటలకు డాన్ గిల్లియం తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. 2020 జనవరి 1న 12.07 గంటలకు రెండవ బిడ్డను ప్రసవించింది.
అయితే కవలలు ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది తేడాతో వేర్వేరుగా జన్మించడం ‘20 లక్షల్లో ఒక్క ఛాన్స్’ అని వైద్యులు పేర్కొన్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

