The great escape: రోబో క్లీనర్ డ్యూటీ ఎగ్గొట్టింది… తెలివిగా రోజంతా తప్పించుకుంది

లండన్: ఒక రోబో వాక్యూమ్ క్లీనర్ డ్యూటీ ఎగ్గొట్టింది. తెలివిగా రోజంతా తప్పించుకున్నది. ఆశ్చర్యపరిచే ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది. కేంబ్రిడ్జ్‌లోని ఆర్చర్డ్ పార్క్‌లో ఉన్న ట్రావెలాడ్జ్ హోటల్లో శుభ్రత కోసం రోబో వాక్యూమ్ క్లీనర్లను వినియోగిస్తున్నారు. అయితే గురువారం డ్యూటీ సమయంలో ఒక రోబో క్లీనర్ మాయమైంది. హోటల్ సిబ్బంది ఎంత వెతికినా అది కనిపించలేదు.
దీంతో హోటల్ సిబ్బంది ఆందోళన చెందారు. సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు. “ఈ రోజు మా కొత్త రోబోట్ వాక్యూమ్లలో ఒకటి తప్పించుకుని పారిపోయింది. సాధారణంగా రోబో వాక్యూమ్ క్లీనర్ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద అపరిశుభ్రతను పసిగట్టి అక్కడే చుట్టూ తిరిగి శుభ్రం చేస్తుంది. కానీ ఈ రోబో అక్కడి నుంచి పరుగెత్తి పారిపోవాలని నిర్ణయించుకున్నది ” అని హోటల్ అసిస్టెంట్ మేనేజర్ రెడ్డిట్‌లో ఒక పోస్ట్ చేశారు.
అయితే ఒక రోజు తర్వాత ఆ రోబో వాక్యూమ్ క్లీనర్ హోటల్ సిబ్బంది కంటపడింది. హోటల్ ముందు భాగంలోని ఒక పొద కింద ఉన్న దానిని సిబ్బంది ఒకరు గమనించారు. దీంతో హోటల్ నిర్వాహకులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆ రోబో వాక్యూమ్ క్లీనర్ ప్రస్తుతం మిగతా వాటితో కలిసి హ్యాపీగా ఉన్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

