జీరో బెడ్రూం హౌస్ ధర ఏకంగా రూ 14.66 కోట్లు పలికింది..ఎక్కడంటే!

న్యూయార్క్ : జీరో బెడ్రూమ్స్, అడ్డదిడ్డంగా నిర్మించిన ఫ్లోర్లతో శిధిలమైన ఇల్లు ఏకంగా రూ 14.66 కోట్లకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. 320 డే ఎస్టీ స్టేట్స్లో లిస్టింగ్ ప్రకారం జీరో బెడ్రూమ్స్, ఒక బాత్రూం, కిచెన్‌తో కూడిన ప్రాపర్టీ అని పొందుపరిచారు. శాన్ఫ్రాన్సిస్కోలోని అప్స్కేల్ నో వ్యాలీలో ఉన్న ఈ పాడుబడిన ఇంటిని కాంట్రాక్టర్స్ స్పెషల్‌గా పేర్కొన్నారు.
120 ఏండ్ల పురాతన ఆస్తిని వేలంలో దాదాపు రూ 14.66 కోట్లకు దక్కించుకున్నారు. బెస్ట్ బ్లాక్‌లో ఉన్న వరస్ట్ ఇల్లు ఇదే కావడంతో మెరుగైన అవకాశంగా బిడ్డర్లు మలుచుకున్నారని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు టాడ్, కిమ్ విలే తెలిపారు. కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు దశాబ్ధాల తరబడి మరమ్మత్తులకు నోచుకోలేదు. పెచ్చులూడిన గోడలు, పురాతన గృహూపకరణాలతో కళాకాంతి లేని ఈ భవనం భారీ ధరకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది.
మల్టీమిలియన్ డాలర్ హోమ్స్ మధ్య ఈ ఇల్లు ఉందని, ఈ ఇంటిని పొరుగు ఇండ్ల మాదిరి మెరిసిపోయేలా మలుచుకునే మెరుగైన అవకాశం మీకు అందుబాటులో ఉంటుందని లిస్టింగ్‌లో పేర్కొనడం బిడ్డర్లను ఆకర్షించింది. దెబ్బతిన్న ఫ్లోరింగ్, 1900 నాటి కిచెన్, కాలం చెల్లిన బాత్రూంతో కూడిన ఈ ఇల్లు ఇంత ధర పలకడమేంటని నెటిజన్లు షాక్ తిన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఇలాంటి ఇల్లు ఇంత ధర పలకడం తాను తొలిసారి చూస్తున్నానని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- auction
- old house history
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

