Monkey ride on Cat | మనషుల్లాగే జంతువులు కూడా సహాయం చేసుకుంటాయి. ఆపదలో ఉన్న జంతువులకు మిగతా జంతువులు కూడా సహాయం అందిస్తూ, తోడుగా ఉంటాయి. అలాంటి వీడియో ఇప్పుడొకటి నెట్టింట వైరల్ అవుతోంది. నలుపు రంగులో ఉన్న ఓ పిల్లి.. పిల్ల కోతిని మోసుకెళ్తున్న వీడియో ట్రెండింగ్లో ఉంది.
అయితే పిల్లి చాలా సహనంతో ఆ పిల్ల కోతిని మోసుకెళ్లింది. పిల్ల కోతి కూడా హాయిగా దాని వీపుపై పడుకుని ఎంజాయ్ చేస్తూ షికారు చేసింది. ఈ రెండింటి స్నేహాన్ని చూసి చాలా మంది ముచ్చటపడ్డారు. పిల్లి, కోతి స్నేహానికి మంత్ర ముగ్ధులయ్యారు. ట్విట్టర్లో పోస్టు చేసిన ఈ వీడియో ఒక మిలియన్ మంది వీక్షించారు. 6,700 మంది రీట్వీట్లు చేశారు.
Taking a free ride.. 😅 pic.twitter.com/bsAup55ZLl
— Buitengebieden (@buitengebieden) November 13, 2022