Viral Video: తుంటరి వ్యక్తికి బుద్ధి చెప్పిన ఒంటె.. అది ఏం చేసిందంటే!

ఒక వ్యక్తి తుంటరి పని చేయబోగా, ఒంటె అతడికి తగినవిధంగా బుద్ధి చెప్పింది. తన వెనుక కాళ్లతో ఒక్కట్టిచ్చింది. దీంతో ఒంటెను ఆటపట్టించబోయిన ఆ వ్యక్తి అదుపుతప్పి కిందపడ్డాడు. ఊహించని ఈ ఘటనకు అక్కడున్న వారు కూడా ఆ ఒంటెకు దూరంగా వెళ్లారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి నందా, ఈ నెల 13న ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కర్మ’ అని దానికి శీర్షిక ఇచ్చారు.
ఇందులో ఒక ఒంటె తన మానాన వీధిలో నడుస్తూ వెళ్తుంటుంది. ఇంతలో ఒక వ్యక్తి తుంటరి పనికి పాల్పడబోయాడు. సరదాగా దాని వెనుకవైపు కొట్టి తోక పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఒంటె అతడి తుంటరి చర్యను ముందుగానే గ్రహించింది. తన వెనుక కాలితో ఆ వ్యక్తిని తన్నింది. దీంతో అతడు పట్టుతప్పి కిందపడ్డాడు. మరోవైపు ఊహించని ఈ ఘటనను చూసి అక్కడున్న కొందరు బిత్తరపోయారు. వెంటనే ఆ ఒంటెకు దూరంగా జరిగి దానికి దారి ఇచ్చారు.
కాగా, ఇన్స్టెంట్ ‘కర్మ’ పేరుతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే 70,500 మందికిపైగా దీనిని వీక్షించగా, 600 మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ ఒంటెతోపాటు దానితో తన్నులు తిన్న ఆ వ్యక్తిపై పలు సెటైర్లు, జోకులు వేశారు.
Karma 🙏🙏 pic.twitter.com/JFld1QYaQW
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) January 13, 2022
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

